దేశంలో ప్రస్తుతం విద్యుత్ సంక్షోభం ఉందనేది అందరికి తెలిసిన విషయం. అయితే ఆయా పార్టీలు ఉపఎన్నికలలో ప్రభావం చూపకుండా ఉండేందుకు ఈ సమస్యను తొక్కిపెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ కోతలు పెరిగిపోతుండటంతో విషయం అందరికి తెలిసిపోతుంది. అయితే ఇంకో కోణం లో దీనిని ఆలోచించినప్పుడు మనకు ఒకటి అర్ధం అవుతుంది. ఈ సంక్షోభం ఇవాళా కాకపోతే ఇంకోరోజు వస్తుంది. కానీ ప్రత్యామ్నాయం ఏమిటి అనేదానిపై ఎక్కువ ద్రుష్టి పెట్టాలనేది ఇప్పటి పరిస్థితులలో నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికే అలాంటివి ఉంటె వాటి ప్రభావం లేదా ఉపయోగం ఎంతవరకు ఉంది, ఇంకా ఎంత విసరించాలి అనేది చూసుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం విద్యుత్ కు ప్రత్యామ్నాయంగా ఉంది సోలార్, ఇన్వెర్టర్, నీటి విద్యుత్.. వీటిలో ఏది మన బడ్జెట్ కు దగ్గరగా సరిపోతుంది, లేదా ఏది ఎక్కువ కాలం అందుబాటులో ఉంటుంది అనేవి అందరు ఆలోచించి పరిష్కారం చేసుకోవాలి. కానీ ప్రస్తుత ప్రభుత్వాలు అన్ని కూడా నేటికీ సమస్య పరిష్కారం అయితే చాలు అన్నట్టే చూస్తున్నాయి. దీనితో ఒక స్థాయిలో దీర్ఘకాలంలో ఇలాంటి సమస్యలు వస్తే, ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయన్నది వాళ్ళు అర్ధం చేసుకోవడం లేదు. ఇప్పటికే గత ప్రభుత్వాలు చేసిన తప్పులు అని వీటిని చెప్పుకుంటున్నామో, వాటి వలన ఇబ్బంది పడినట్టే కదా అర్ధం. ఆ ఇబ్బంది ఇంకో తరం పడకుండా నీ ప్రభుత్వం ఏమి చేస్తుంది అన్నది ప్రధానం.

ఇలాంటి సమస్యలను పరిష్కరించే ఆలోచనలు చేయకుండా, విమర్శించడమే ప్రధాన ఎజండా గా పెట్టుకుంటూ కూర్చుంటే దానిని ప్రతిపక్షం అనరు. ప్రతి ప్రభుత్వానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, అలాగే ప్రతిపక్షానికి కొన్ని ఉంటాయి. దానిని తగ్గట్టుగా ప్రవర్తిస్తేనే తమ స్థాయిలో ఉన్నట్టు లేదంటే దిగజారినట్టే. ప్రస్తుతం మాత్రం అందరు దిగజారుడు రాజకీయాలను కోరుకోవడం లేదు. మార్పును కోరుకుంటున్నారు. ఆ మార్పు రాజకీయాల నుండి వనరుల వినియోగం దాకా అన్నిటిలో కనిపిస్తేనే అభివృద్ధి సమిష్టిగా జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడే ఇలాంటి సంక్షోభాలు రావు.

మరింత సమాచారం తెలుసుకోండి: