మారుమూల ప్రాంతం అయిన శ్రీ‌కాకుళంపై విద్యుత్ కోత‌ల ప్ర‌భావం అప్పుడే మొదల‌యిపోయింది. ప్రాసెసింగ్ యూనిట్ల‌కు మిన‌హా మిగ‌తా ప‌రిశ్ర‌మ‌ల‌కు కోత‌లు అధికారికంగా అమ‌లు కావ‌డంతో ఏ నిమిషాన ఏం జ‌రుగుతుందో అన్న భ‌యం ఒక‌టి పారిశ్రామిక వ‌ర్గాల్లో నెల‌కొంది. క‌రెంట్ ఛార్జీల పెంపుద‌ల ఓ వైపు, వీటికి తోడు కోత‌లు మ‌రోవైపు ఉండ‌డంతో ప్ర‌భుత్వాన్ని తాము ఏ విధంగా అర్థం చేసుకోవాలో అన్న‌ది తెలియ‌క త‌మ‌కు తిక‌మ‌క త‌ప్ప‌డం లేద‌ని అంటున్నారు. అవ‌స్థ‌లు దాటి లాక్డౌన్లు దాటి
ఎలానో ఒక‌లా పరిశ్ర‌మ‌ల‌ను నిలుపుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న త‌మ‌కు జ‌గ‌న్ నిర్ణ‌యాలు అన్నీ ఆశ‌నిపాతంగానే ఉన్నాయ‌ని, ఇలాంటి స‌ర్కారు విధివిధానాలు గ‌తంలో ఎన్న‌డూ లేవ‌ని, వేస‌విలో కోత‌లు సాధార‌ణ‌మే కానీ వ‌ర్షాకాలంలో కూడా కోత‌లేంట‌న్న‌ది వారి ప్ర‌శ్న. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల‌లో కూడా అన‌ధికార కోత‌లు విధిస్తుండ‌డంతో కుటీర ప‌రిశ్ర‌మ‌ల‌పై దీని ప్ర‌భావం పుష్క‌లంగా ఉంటోంది.  కోత‌ల కార‌ణంగానే తాము కోలుకోవ‌డం క‌ష్ట‌మ‌ని తేలిపోయింద‌ని, ఇప్ప‌టికైనా ప్ర‌త్యామ్నాయ చ‌ర్య‌లు త్వ‌రిత‌గ‌తిన చేప‌ట్టాల‌ని కోరుతున్నారు వీరంతా!


జ‌గన్ స‌ర్కారు పుణ్య‌మాని చాలా ఉత్ప‌త్తి రంగాలకు సంక్షోభం రానుంది. చిన్నా చిత‌కా ప‌రిశ్ర‌మ‌లు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా వాటిపై కూడా జ‌గ‌న్ స‌ర్కారు క‌రుణ చూప‌డం లేదు. భారీ, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు ఎలానూ కోత‌లు త‌ప్ప‌డం లేదు. ఇవ‌న్నీ సాయంత్రం వేళ‌ల్లో ఆరు నుంచి పది గంట‌ల వ‌ర‌కూ కోత‌లు విధించి, సంబంధిత విద్యుత్ ను గృహావ‌స‌రాలకు కేటాయిస్తూ అధికారు లు కాస్త ప్ర‌జాగ్ర‌హం లేకుండా చూసుకుంటున్నారు. ఇదే స‌మయంలో ఉత్ప‌త్తి రంగాల‌కు చెందిన పెద్ద‌ల నుంచి చీవాట్లు తింటున్నా రు. శ్రీ‌కాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గం, ర‌ణ స్థ‌లం మండల కేంద్రంకు పారిశ్రామిక వాడ‌గా పేరుంది. ఇక్క‌డ ఫార్మా  కంపెనీలతో పాటు చిన్నా చిత‌కా ప‌రిశ్ర‌మ‌లూ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 3033 వాణిజ్య ప‌రిశ్ర‌మ‌లు ఉన్నాయి.




అదేవిధంగా మొత్తం విద్యుత్ క‌నెక్ష‌న్లు  867863 ఉన్నాయి. వీటిలో గృహావ‌స‌రాలకు చెందిన క‌నెక్ష‌న్లు 7,50,000 ఉన్నాయి అని, వ్య‌వ‌సాయ క‌నెక్ష‌న్లు 26 వేలు అని గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ కాస్తో కూస్తో వృద్ధిలో ఉన్న ప‌రిశ్ర‌మ‌ల‌కు కోత‌లు విధించ‌డంతో ఇవ‌న్నీ మ‌ళ్లీ తిరోగామి స్థానాల‌కు చేరుకోవ‌డం ఖాయం. జిల్లాలో భారీ, మ‌ధ్య‌, చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు 1126 ఉండ‌గా, వీటి ద్వారా 42,446 మంది ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు వీరంతా త‌మ భ‌విష్య‌త్ ఏంట‌న్న‌ది తెలియ‌క ఆందోళ‌న‌ప‌డుతున్నారు. జ‌న‌రేటర్ల‌తో ఉత్ప‌త్తి రంగాల‌ను న‌డ‌ప‌డం సాధ్యం కాని ప‌ని అని, అది ఇంకా ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని అని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా క‌రెంటు కోత‌లు కార‌ణంగా వ‌చ్చిన ఆర్డ‌ర్లు కూడా వెన‌క్కుపోతాయి అని ఆవేద‌న చెందుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp