ప్ర‌స్తుత టీడీపీ నేత‌, విజ‌య‌వాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా దశాబ్దకాలం నుంచి పదవులకు దూరంగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే ఆయ‌న దివంగ‌త వంగ‌వీటి రంగా వార‌సుడి కేవ‌లం 26 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చి కాంగ్రెస్ నుంచి విజ‌య‌వాడ తూర్పు ఎమ్మెల్యే గా ఎన్నిక‌య్యారు. త‌ర్వాత 2009 లో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వ‌ద్ద‌ని చెపుతున్నా కూడా విన‌కుండా కేవ‌లం క్యాస్ట్ ఫీలింగ్ తో ఆయ‌న ప్ర‌జారాజ్యం లోకి వెళ్లిపోయారు.

ఆ ఎన్నిక‌ల‌లో ఓడిన రాధా మ‌రోసారి వైసీపీ లోకి వెళ్లారు. 2014 ఎన్నిక‌ల‌లో పార్టీ మార‌డంతో త‌న‌కు ప‌ట్టున్న విజ‌య‌వాడ సెంట్ర‌ల్ సీటు ను కాద‌నుకుని విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత వైసీపీ లో ఆయ‌న క‌ష్ట ప‌డ‌డం లేద‌ని జ‌గ‌న్ పొమ్మ‌న కుండా పొగ పెట్టేశారు. ఆయ‌న‌కు న‌గ‌రంలో సీటు లేకుండా చేసేశారు. దీంతో ఎన్నిక‌ల‌కు ముందు రాధా టీడీపీ లో చేరారు.

గ‌త ఎన్నిక‌ల‌లో ఆయ‌న పోటీ చేయ‌లేదు. అయితే టీడీపీ ఓడిపోయింది. ఇప్పుడు పేరుకు  మాత్ర‌మే టీడీపీలో ఉన్నా యాక్టివ్ గా లేరు. ఇక ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌లలో కూడా రాధా పోటీ చేయ‌క‌పోతే ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు శుభం కార్డు ప‌డిన‌ట్టే అవుతుంది. అయితే కొంద‌రు మాత్రం టీడీపీ + జ‌న‌సేన ఎల‌యెన్స్ ఎలాగూ ఉంటుంద‌ని.. అందుకే జ‌న‌సేన లోకి వెళ్లాల‌ని సూచిస్తున్నార‌ట‌.

జ‌న‌సేన లోకి వెళితే క‌మ్యూనిటీ ప‌రంగా మ‌రింత స్ట్రాంగ్ అవ్వ‌డంతో పాటు ఆ పార్టీలో రాష్ట్ర స్థాయిలో కీల‌కంగా ,వ్యవహరించవచ్చని   ఆయ‌న‌కు చెపుతున్నార‌ట‌. ముఖ్యంగా బెజ‌వాడ లోని కాపు యువ‌త జ‌నసేన పుంజుకుంద‌ని.. రాధాను ఆ పార్టీలో చేరాల‌ని ఎంక‌రేజ్ చేస్తున్నార‌ట‌. దీంతో రాధా ప్ర‌స్తుతం సంక‌ట స్థితిలో ప‌డిపోయార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రి టీడీపీలోనూ బాబు ఆయ‌న‌కు ప్ర‌యార్టీ ఇవ్వాల‌నుకుంటోన్న టైంలో ఆయ‌న పార్టీ మార‌తారా ?  లేదా ? అన్న‌ది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: