ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య‌మంత్రిగా జగన్ మోనార్క్. ఆయన చెప్పిందే వేదం... ఆయ‌న చేసిందే వేదం.. ఆయ‌న మాటే ఓ శాస‌నం. ఆయ‌న‌కు అక్క‌డ ఎదురు ఉండ‌దు.. ఎదురు చెప్పే వారు ఉండ‌రు.. పార్టీలో ఎక్క‌డైనా ఆయన నిర్ణయాలే  అమలవుతాయి. అయితే జ‌గ‌న్ కాస్తో కూస్తో ఎవ‌రి మాట వింటారు ? అన్న ప్ర‌శ్న‌కు మాత్రం వ‌చ్చేవి.. వినిపించేవి రెండు ఆన్స‌ర్లు మాత్ర‌మే. ఆ రెండు పేర్లే 1. సజ్జల రామకృష్ణారెడ్డి - 2. విజయసాయిరెడ్డి. జ‌గ‌న్ అనే క కేసుల్లో ఇరక్కు పోయిన‌ప్పుడు , పార్టీ క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు విజ‌య‌సాయి జగన్ కు బ‌లంగా వెన్నుదన్నుగా నిలిచారు. అస‌లు జ‌గ‌న్ ఆత్మే విజ‌య సాయి అన్న‌ట్టుగా మారిపోయింది.

ఇక 2019 ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు కూడా విజ‌య సాయే పార్టీలో కీల‌కంగా ఉండేవారు. అయితే పార్టీ అధికారంలోకి వ‌చ్చాక విజ‌య‌సాయి పాత్ర కేవ‌లం ఉత్త‌రాంధ్ర‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యింది. అప్ప‌టి వ‌ర‌కు ఢిల్లీ లో కీల‌కంగా ఉన్న విజ‌య సాయిని త‌ప్పించే సి ఆ బాధ్య‌త‌లు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి అప్ప‌గించేశారు. ఇక జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక విజ‌య సాయి ప్లేస్ ను మ‌రో కీల‌క నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించారు.

అయితే ఇప్పుడు స‌జ్జ‌ల‌, విజ‌య సాయి ఆధిప‌త్యానికి కూడా పూర్తిగా గండి ప‌డ‌నుంద‌ని అంటున్నారు. ఇప్పుడు ఏపీలో ప్ర‌భుత్వం తో పాటు పార్టీ కంట్రోల్ అంతా రాజ‌కీయ స‌ల‌హా దారు ప్రశాంత్ కిషో ర్ చేతుల్లో కి వెళ్లనుంది. పీకే టీం సలహాలు, సూచనల మేరకే ఇక టిక్కెట్ల కేటాయింపు అయినా.. ఇత‌ర కీల‌క నిర్ణ‌యాలు అయినా అమ‌లు జ‌రుగు తాయ‌ని అంటున్నారు. అప్పుడు విజ‌య సాయి తో పాటు అటు స‌జ్జ‌ల పాత్ర పూర్తి గా నామ‌మాత్రం కానుంది. మొన్న బెంగాల్ ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు తృణ‌మూల్ పార్టీలోనూ అదే జరిగింది.. ఇప్పుడు కూడా అదే జ‌ర‌గ‌బోతోంద‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: