రెండున్న‌రేళ్ల త‌రువాత మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణను షురూ చేశారు జ‌గ‌న్. ఈ నిర్ణ‌యంపై ఇప్ప‌టికే కొన్ని పెద‌వి విరుపులు ప్రారంభం అయిపోయాయి. కోవిడ్ కార‌ణంగా ఇళ్ల‌కే ప‌రిమితం అయిపోయిన నేత‌లు ఇప్పుడిప్పుడే క‌లుగు నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు.
ప‌ద‌వులు అనేస‌రికి అమ‌రావ‌తి చుట్టూ తిరుగుతున్నారు.


సీఎం మాత్రం ఇక్క‌డ మీరు హ‌ల్ చ‌ల్ చేసినంత మాత్రాన ప‌దవులు రావ‌ని, ప‌నిచేసేవారికే ప‌ద‌వులు అని గ‌ట్టిగా చెప్పి పంపుతున్నారు. మీరు బ్యాన‌ర్లూ, ఫ్లెక్సీలూ త‌దిత‌ర ప్రచార సామాగ్రి ఏర్పాటులో ఉన్న శ్ర‌ద్ధ పాల‌నపై చూపితే మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని తెగేసి చెబుతున్నారు. ఇవ‌న్నీ సొంత మ‌నుషుల‌కు కూడా వ‌ర్తిస్తాయ‌ని కూడా చెప్పి పంపుతున్నారు. ఇదే ఇప్పుడు క‌డ‌ప జిల్లా నేత‌ల‌కు కంట‌గింపుగా మారింది. రెడ్డి సామాజిక‌వ‌ర్గ నేత‌ల‌కు మ‌రీ! ఇబ్బందిక‌రంగా మారింది. కొన్ని అసంతృప్త‌త‌లు ఉన్నా స‌ర్దుకుపోవాల‌ని  మీడియా ఎదుట మాట్లాడొద్ద‌ని కూడా చెబుతున్నారు సీఎం. ఈ నేప‌థ్యంలో డీఎల్ ర‌వీంద్రా రెడ్డి నోరు పారేసుకున్నారు. స‌జ్జ‌ల‌ను టార్గెట్ చేశారు. ఇదే ఇప్పుడు ఏపీ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఎన్నో క‌ష్టాలు న‌ష్టాలు ఓర్చి అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ కు సొంత మ‌నుషులే వ్య‌తిరేకులు అయిపోతున్నారు. అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి నేటి వ‌ర‌కూ ఎవ్వ‌రినీ ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా రెడ్డి సామాజిక‌వ ర్గంకు చెందిన నేత‌లే సీఎంపై కారాలూ మిరియాలూ నూరుతున్నారు. రేప‌టి వేళ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణే జ‌రిగే అవ‌కాశం ఉంటే అది ఇం కా పెరిగిపోయేందుకు అవ‌కాశం ఉంది. క‌డప జిల్లా నుంచి డీఎల్ ర‌వీంద్రా రెడ్డి ఇప్ప‌టికే అస‌హ‌న స్వ‌రం వినిపించారు. ఇంకా ఇంకొం ద‌రు ఇదే కోవ‌లో ఉన్నార‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లోగా మ‌రికొంద‌రు పార్టీ దాటి పోవాల‌ని కూడా అనుకుంటున్నారు. జ‌గ‌న్ వ్య‌వహార శైలికి విసిగి ఎవ‌రి దారి వారు చూసుకుంటున్నారు.


కానీ జ‌గ‌న్ వాద‌న మాత్రం మ‌రోలా ఉంది. ఇప్ప‌టికే పార్టీలోనూ, ప్ర భుత్వంలోనూ రెడ్ల ప్రాబ‌ల్యం, ప్రాధాన్యం ఎక్కువ‌గా ఉన్నందున తాను సొంత సామాజిక‌వ‌ర్గాన్ని దూరం పెడుతున్నాన‌ని అంటు న్నారు. ప‌ద‌వుల కేటాయింపులో బీసీల‌కే ప్రాధాన్యం ఇవ్వాల‌ని భావిస్తున్నానని కూడా చెబుతున్నారు. వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు చెందిన నేత‌లు ఇప్ప‌టికే ప‌ద‌వుల విష‌య‌మై అసంతృప్తితో ఉన్నార‌ని, రాయ‌ల‌సీమ‌తో పాటు ఉత్త‌రాంధ్ర‌కూ స‌మ ప్రాధాన్యం ఇవ్వాల‌ని ఆయ‌న భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp