హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో దొంగతనాలు పెరుగుతున్న నేపధ్యంలో హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టి పని చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఒక దొంగతనం సంచలనం అయింది. ఈ దొంగతనం వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఈరోజు తెల్లవారుజామున సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో నేపాల్ ముఠా దొంగతనం చేసింది అని తెలిపారు. ఇంట్లో పనిమనిషిగా చేరి చోరీ చేసారు భార్యా భర్తలు అని ఆయన పేర్కొన్నారు.

మార్వాడి చెందిన వారి ఇంట్లో గత కొద్ది రోజులుగా పనిమనుషుల గా చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇంట్లో పనిమనిషి పెట్టుకునే ముందు వారి వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి అని తెలిపారు. లోకల్ పోలీస్ స్టేషన్ లో వివరాలు నమోదు చేయండి అని సూచించారు. హైదరాబాద్ పోలీసులు హాక్ ఐ యాప్ ను తీసుకురావడం జరిగింది అని ఈ యాప్ లో వారి వివరాలను తెలుసుకోవచ్చు.. వారి పైన గతంలో ఇలాంటి కేసులు ఉన్న తెలుసుకోవచ్చు అన్నారు ఆయన. సంవత్సరం కాలంలో 38 మంది నేపాలి ముఠాలు ఇలాంటి తరహా చోరీలు చేశారు అని ఆయన పేర్కొన్నారు.

ఇంట్లో పనిమనిషులను పెట్టుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సిటీ పోలీస్ తరుపున సూచిస్తున్నాం అని అన్నారు. చార్మినార్ వద్ద ప్రతి నెలలో రెండు సార్లు ఏక్ శ్యామ్ చార్మినార్ కే నామ్ అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది అన్నారు ఆయన. ఇక గడిచిన 8 వారాలుగా ట్యాంక్ బండ్ పై సండే ఫన్ డే పోగ్రామ్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది అని వెల్లడించారు. దీన్ని స్పూర్తిగా తీసుకొని చార్మినార్ వద్ద ఏక్ శ్యామ్ చార్మినార్ కే నామ్ అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం కాబోతుంది అని వివరించారు. ఇదే చార్మినార్ దగ్గర పర్యాటకులను ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts