వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సామవేశం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమక్షంలో జరిగింది. ఈ సమావేశంలో సోనియా గాంధీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. మనదేశంలో విదేశాలతో అవలంబించే విదేశాంగ విధానం పై ఎప్పుడు ఏకాభిప్రాయం ఉండేది అని కాని ప్రస్తుత ప్రధాని ఈ విషయంలో అర్ధవంతమైన రీతిలో విపక్షాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు అని ఆమె ఆరోపణలు గుప్పించారు. గత సంవత్సరం చైనా మన భూభాగాలపై దురాక్రమణ చేసినప్పుడు అటువంటిది ఏమీ లేదని ప్రధాని ప్రతిపక్షాలకు వివరణ ఇచ్చారు అని అన్నారు.

ప్రధాని మౌనం కారణంగా దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది అని ఆమె హెచ్చరించారు. రానున్న 4 రాష్ట్రాల ఎన్నికలపై పార్టీ పూర్తి దృష్టి పెట్టింది అని ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సన్నద్ధత ప్రారంభించాము అని  ఆమె అన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా మన పార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నది అని ఆమె వెల్లడించారు. మనము క్రమశిక్షణ తో పార్టీ ప్రయోజనాలకోసం పనిచేస్తే విజయం సాధించగలమన్న నమ్మకం ఉంది అని ఆమె ఆశాభావం వ్యక్తం చేసారు. ఆయా రాష్ట్రాల పార్టీ ఇంచార్జ్ సభలు అక్కడ పరిస్థితిని నాకు ఎప్పటికప్పుడు వివరిస్తారు అని అన్నారు.

కాంగ్రెస్ సంస్థలో అందరూ పార్టీ  పునరుజ్జీవనం కోరుకుంటున్నారు అని ఆమె తెలిపారు. అయితే దీనికి ఐక్యత అవసరం మరియు పార్టీ ప్రయోజనాలు పరమావధి గా అందరూ వ్యవహరించడం అవసరం అని అన్నారు సోనియా. కాంగ్రెస్ పార్టీలో స్వీయ నియంత్రణ మరియు క్రమశిక్షణ అవసరం అని అభిప్రాయపడ్డారు. 2021 జూన్ 30 లోపు సాధారణ అధ్యక్షుడిని ఎన్నుకోవటానికి ఒక రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసారు... కానీ కోవిడ్ -19 యొక్క రెండవ వేవ్ కారణంగా ఈ గడువు పొడిగించబడింది అని అన్నారు. పూర్తి స్థాయి సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ గురించి ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ తర్వాత మొత్తం ప్రక్రియ గురించి మీకు తెలియజేస్తారు అని అన్నారు. కాగా కేసి వేణుగోపాల్ కర్ణాటకకు చెందిన అగ్ర నేత.

మరింత సమాచారం తెలుసుకోండి: