తెలంగాణ‌లో హుజురాబాద్ ఉప ఎన్నిక హీట్ పుట్టిస్తోంది.  రోజు రోజుకు ఉత్కంఠ పెరిగిపోతోంది. బ‌రిలో ఉన్న మూడు పార్టీలు ప్ర‌చారంలో  దూసుకుపోతున్నాయి. మాట‌ల తూటాల‌తో మంట‌లు పుట్టిస్తున్నారు నేత‌లు. ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై ఓట్లు అడుగుతున్నారు. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌, బీజేపీ నుంచి ఈట‌ల రాజేంద‌ర్‌, కాంగ్రెస్ నుంచి బ‌ల్మూరి వెంక‌ట్ బ‌రిలో ఉండ‌డంతో తీవ్ర పోటీ నెల‌కొంది. దీంతో ఆయా పార్టీలు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. 


హుజురాబాద్ గ‌డ్డ‌పై గులాబీ జెండా ఎగుర‌వేసేందుకు పావులు క‌దుపుతున్నారు టీఆర్ఎస్ నాయ‌కులు. త‌మ సిట్టింగ్ స్థానాన్ని నిల‌బెట్టుకోవ‌డాఇకి ఈట‌ల‌కు చెక్ పెట్టేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు.  ఇప్ప‌టికే టీఆర్ఎస్ నేత‌లు హుజురాబాద్‌లో మ‌కాం వేసి ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. అలాగే సీఎం కేసీఆర్ కూడా ఎన్నిక‌ల ప్ర‌చారంపై ఫోక‌స్ పెట్టారు. ఎల‌క్ష‌న్‌ను ప‌ర్వాన్ని మ‌రింత ర‌క్తి క‌ట్టించేందుకు సీఎం కేసీఆర్ ప్ర‌చార‌ప‌ర్వంలోకి అడుగుపెట్ట‌నున్నారు. హుజురాబాద్ లో సీఎం కేసీఆర్‌తో భారీ స‌భ‌ను ఏర్పాటు చేయ‌డానికి ఎన్నిక‌ల క‌మిటీ ప‌రిశీలిస్తోంది.


నిబంధ‌న‌ల కార‌ణంగా సాధ్య‌సాధ్యాపై యోచిస్తున్నారు.   ఒక వేళ హుజురాబాద్‌లో సీఎం స‌భ నిర్వ‌హ‌ణ‌కు వీలు కాకుంటే పొరుగున ఉన్న వ‌రంగ‌ల్‌లో రూర‌ల్ జిల్లా ప‌రిధిలో సీఎం కేసీఆర్ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేయాల‌నే ఆలోచ‌న‌లో అధికార పార్టీ ఉంది. 24 వ తేది త‌రువాత కేసీఆర్ స‌భ నిర్వ‌హించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

 
మ‌రోవైపు పార్టీ సంస్థాగ‌త నిర్మాణం పూర్తి చేసే ప‌నిలో అధికార పార్టీ నిమ‌గ్న‌మ‌యింది. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ట్ట‌ణ, మండ‌ల‌, జిల్లా స్తాయిలో క‌మిటీల నియామ‌కం దాదాపు పూర్త‌యింది. జిల్లా అధ్య‌క్షుల నియామ‌కం కోసం టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తున్నారు.  ఈ క్ర‌మంలో పార్టీ ప్ర‌తినిధుల స‌భ‌తో పాటు సీఎం కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇది కూడా హుజుబాద్ ప్ర‌చారం ముగిసేలోపే నిర్వ‌హించాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: