హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో ఈట‌ల విజ‌యం కోసం మాజి ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి త‌నవంతు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌స్తుతం రాజ‌కీయంగా త‌ట‌స్థంగా ఉన్న ఆయ‌న ఈట‌ల‌కు అండ‌గా ఉంటున్నారు. తాను ప్ర‌స్తుతం ఇండిపెండెంట్‌గా ఉన్నాన‌ని ఏ రాజ‌కీయ పార్టీలోనూ లేన‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి. కాంగ్రెస్ నంచి బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని.. అందులో గ‌న‌క ఉంటే ఇప్పుడు ఈట‌ల‌కు మ‌ద్ధ‌తు ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని ఇండిపెండెంట్‌గా ఉన్నందున ఏది అనుకుంటే అది చేయ‌డానికి స్వేచ్ఛ ఉంద‌ని చెబుతున్నారు.
 

  తెలంగాణ ప్ర‌జానీకానికి  కేసీఆర్ అహంకారానికి మ‌ధ్య జ‌రుగుతున్న ఎన్నిక‌గా హుజురాబాద్ ఉప ఎన్నిక‌గా కొండా అభివ‌ర్ణించాడు. అలాగే, ఈట‌ల‌కు మ‌ద్ధ‌తుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈట‌ల‌పై త‌న‌కు ప్రేమ కాదు కానీ. తెలంగాణ‌కు ఏది మంచిదో అది చేయాల‌ని త‌న అభిప్రాయం అని విశ్వేశ్వ‌ర్ రెడ్డి అన్నారు. ఇంకా చెప్పాలంటే గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌ను ఓడ‌గొట్టడంతో ఈట‌ల పెద్ద పాత్ర పోషించాడ‌ని చెప్పుకొచ్చారు. త‌న‌ను ఓడించేందుకు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించార‌ని అన్నారు. కానీ, అవ‌న్ని త‌న‌కు ముఖ్యం కాద‌ని, తండ్రి, కొడుకుల పార్టీ నుంచి తెలంగాణ‌ను విముక్తి చేసేందుకే తాను ప‌ని చేస్తున్నాన‌ని కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి చెప్పారు.


 హుజురాబాద్‌లో ఈట‌ల రాజేంద‌ర్ గెల‌వాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. టీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణ ఉద్య‌మ పార్టీ కాద‌ని తెలంగాణ ద్రోహుల పార్టీ అని అన్నారు. తెలంగాణ‌కు ద్ర‌హం చేసిన వారు ఇప్పుడు మంత్రులుగా ఉన్నార‌న్నారు. తెలంగాణ కోసం నిజంగా కొట్లాడింది ఈట‌ల అని గుర్తు చేశారు. తండ్రి, కొడుకుల‌పై గొంతు ఎత్తినందునే భూక‌బ్జా ఆరోప‌ణ‌ల‌తో పార్టీ నుంచి వెల్ల‌గొట్టార‌ని విమ‌ర్శించారు. కేసీఆర్ ఫాం హౌజ్‌కు అసైన్డ్ భూముల్లో నుంచే దారి పోతుంద‌ని, భూక‌బ్జాలు చేసిన చాలా మంది టీఆర్ ఎస్‌లో ఉన్నార‌న్నారు.  వారిపై చ‌ర్య‌లెందుకు తీసుకోలేదో అని ప్ర‌శ్నించారు.  మ‌రి ఈట‌ల విష‌యంలో కొండా ప్ర‌య‌త్నం ఏ మేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: