మోడీ సర్కారు వైఫల్యాలపై కదం తొక్కాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్ని ప్రభుత్వ వ్యతిరేకతను జనంలోకి తీసుకెళ్లాలని.. ప్రజాపోరాటాలకు ముందుకు రావాలని శ్రేణులకు సూచించారు. కేంద్రం
మూడు నల్ల చట్టాలని పార్లమెంట్‌లో బుల్‌డోజ్‌ చేసి ఆమోదించి సంత్సరం దాటిందని గుర్తు చేసిన సోనియా.. రైతులు, రైతు సంఘాల ఆందోళన కొనసాగుతోందని.. కొన్ని ప్రైవేట్ సంస్థల ప్రయోజనం పొందడానికి మోదీ ప్రభుత్వం మూడు నల్ల చట్టాలను ఆమోదించడానికి అందరిని నరక యాతన  పెట్టిందని అన్నారు.


సాగు చట్టాలు ఆమోదం పొందిన నాటి నుంచి రైతులు తమ నిరసన ప్రారంభించి.. ఎంతో నష్టపోయారని.. లఖింపూర్‌ ఖేరీలో ఇటీవల జరిగిన దిగ్భ్రాంతికరమైన సంఘటనల ద్వారా బీజేపీ  మనస్తత్వాన్ని బయటపడుతోందని సోనియా కామెంట్ చేశారు. రైతులు ఆందోళన పట్ల బిజెపికి ఎలాంటి ఆలోచన ఉందో తెలిపేందుకు ఈ లఖింపూర్ ఘటన ఒక్కటి చాలని సోనియా గాంధీ ఏఐసీసీ సమావేశంలో తెలిపారు. రైతులు వారి జీవితాలు, జీవనోపాధిని కాపాడుకోవడానికి ఎంత కృత నిశ్చయంతో ఉన్నారో.. వారికి పోరాటంలో అండగా నిలిచే విషయంలో కాంగ్రెస్‌కూడా అంతే సంకల్పంతో ఉండాలని సోనియా అన్నారు.


మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాల వల్ల.. ఎస్‌సి, ఎస్‌టి, వెనుకబడిన వర్గాల సాధికారత, అభివృద్ది.. ఇలా అన్నీ ప్రమాదంలో పడ్డాయని సోనియా అన్నారు. మోడీ సర్కారు రక్షిస్తున్నామనే పేరుతో వ్యవస్థలను మరింత ప్రమాదంలోకి నెడుతోందన్నారు. దేశంలో పెట్రోల్ ధర రూ. 100, డీజిల్ లీటర్ రూ.100కు చేరుతుందని, గ్యాస్ సిలిండర్ ధర రూ.900, వంట నూనె లీటర్ రూ. 200లకు చేరుతాయని మనలో ఎవరైనా ఎప్పుడైనా ఊహించారా.. అని ప్రశ్నించారు.


నిత్యావసర వస్తువుల ధరలు, ఆహారం, ఇంధనం ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయని.. సామాన్యుడి జీవితం దుర్భరం అవుతోందని.. ఈ సమస్యలపై ఎక్కడికక్కడ పోరాటం ఉధృతం చేయాలని సోనియా పిలుపు ఇచ్చారు. ప్రజాపోరాటాల ద్వారానే పార్టీ బలోపేతం అవుతుందని సోనియా అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: