రాష్ట్రంలో రాబోయేది చీకటి రోజులే అని హెచ్చరించారు ఏపీ రఘురామ కృష్ణం రాజు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరెంట్ కోతలు మొదలయ్యాయి అని ఆయన వ్యాఖ్యలు చేసారు. పట్టణాలలో 12 గంటలకు,పల్లెల్లో సాయంత్రం 6 గంటలకు కరెంట్ తీసేస్తున్నారు అని గుర్తు చేసారు. కిరాయి మనుషుల తో నేను నియోజకవర్గానికి రావడం లేదు అని అనిపిస్తున్నారు అని... నా నియోజకవర్గంలో ఆక్వా కల్చర్ ఎక్కువగా ఉంటుంది,చేపల చెరువులు ఉంటాయి వాటికి విద్యుత్ అవసరం అని ఆయన కోరారు. పవర్ కట్ మూడు నుండి నాలుగు గంటలు చేస్తున్నారు అని అన్నారు.

రొయ్యి బతికితేనే ఆక్వా రైతు బతుకుతాడు..  డీజిల్ తో జనరైటర్ నడిపితే  ఖర్చులు ఎక్కువ అవుతాయి అని ఆయన విమర్శలు చేసారు. రైతు భరోసా కేంద్రాలు కట్టింది తక్కువ చెప్పేది ఎక్కువ అని నా నియోజకవర్గం సమస్యలను పట్టించుకోవడం లేదు అని అంటున్నారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. నేను ఢిల్లీలో ఉన్న ఏపీ ప్రజల కష్టాల గురించి ఆలోచిస్తున్నాను అని ఎంపీ స్పష్టం చేసారు. ఏపీ లో ఉంటూ ఢిల్లీ గురించి మరికొందరు ఆలోచిస్తున్నారు అని ఎద్దేవా చేసారు. ఏపీ లో ఉండి ప్రజలను మర్చిపోయారు,ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి అని సూచించారు.

ఆక్వా రైతులకు విద్యుత్ లేకపోతే ఎంతోమంది ఉపాధి కోల్పోతారు అని అన్నారు ఆయన. కరెంట్ కు బొగ్గు ఇవ్వలేని వారు, ఆక్వా కు సీడ్,ఫీడ్ ఎలా ఇస్తారు ? అని నిలదీశారు. పరిపాలన అంటే ఇది కాదు..మనం చేస్తుంది తప్పు  అని వ్యాఖ్యానించారు. చేపలు ఎలా పెంచాలో మా జిల్లా వాళ్లకు మీరు చెప్తారా....అవసరం లేని  వాటిలో జోక్యం చేసుకోకండి అని హితవు పలికారు. పవర్ ఇబ్బందులు ఉన్నాయి అని మంచి అధికారులు ఉన్నా వారికి స్వేచ్ఛ లేదు అని పేర్కొన్నారు. బొగ్గు పై ప్రధానమంత్రి కి సీఎం లేఖ రాశారు..ప్రధాని స్పందించారు అని అంటున్నారు,సినిమా కథలు చెప్పకండి అంటూ ఎద్దేవా చేసారు. విద్యుత్ పై ఒక ప్రణాళిక రుపొందించండి...సీఎం గారు అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: