ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అర్థం మారుస్తోంది అంటూ ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలతో ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఉన్న ఉద్యోగులను తొలగించి ఉద్యోగాలకు నోటి ఫికేషన్లు విడుదల చేస్తోంది అని అన్నారు ఆయన. ఈవిధంగా స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏ ప్రభుత్వం ఇంతటి సాహసం చేయలేదు అని విమర్శలు చేసారు. తొలగించిన ఉద్యోగులు చాలా కీలకమైన శాఖ లో నిత్యం ప్రజలకు సేవచేసే విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల ను ఒక కలంపోటుతో ఉద్యోగుల ను తొలగించడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్భన్ హెల్త్ సెంటర్ ఉద్యోగులు తమకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని సోము దృష్టికి తీసుకు వెళ్ళారు. రాష్ట్ర వ్యాప్తంగా 1700 మంది ఉద్యోగుల ను ప్రభుత్వం తొలగించి నోటిఫికేషన్ వేయడం దారుణం అని వారు ఆవేదన వ్యక్తం చేసారు. జాబ్ క్యాలెండర్ అంటే ఉద్యోగాలు వస్తాయంటే ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయని అర్బన్ హెల్త్ సెంటర్ ఉద్యోగులు వాపోతున్నారు అని అన్నారు ఆయన. కరోనా రెండు సీజన్లో కష్టపడి పనిచేస్తే ప్రభుత్వం మాఉద్యోగాలు ఊడగొట్టిందని బాదిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు అని సోము పేర్కొన్నారు.

నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కేంద్రం నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలనుండి తొలగించడం ఏమిటని ఈ సందర్భంగా నిలదీశారు. కేంద్రంలో వాజ్ పేయి  ప్రధాని గా బిజెపి ప్రభుత్వం ఏర్పడి నప్పుడు నేషనల్ హెల్త్ మిషన్ ఏర్పాటు చేసి 2000 సంవత్సరం నుండి స్వచ్ఛంద సంస్థలు సహకారంతో 2016  వరకు అర్భన్ హెల్త్ సెంటర్లలో  ప్రజలకు సేవలు అందించాయి అని ఆయన గుర్తు చేసారు. అయితే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక స్వచ్ఛంద సంస్థల స్థానంలో కార్పొరేట్ ఏజెన్సీ లను ఏర్పాటు చేసి అర్భన్ హెల్త్ సెంటర్లను ఏజెన్సీ పరిధిలో కి తీసుకుని వచ్చారు అయితే ఉద్యోగుల ను వారిని కొనసాగించారు అని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp