ఉపాధి అవ‌కాశాలు ఎలానూ లేవు స‌ర్ క‌నీసం మ‌మ్మ‌ల్ని మాకు తెలిసిన విధంగా బ‌తక‌నివ్వండి అని సిక్కోలు ప్రాంత రైతులు త‌మ గోడు వినిపిస్తున్నారు. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో! ముందంతా ఆక్వా సాగు - బాగు బాగు అని రాసిన పేప‌రోడే ఇప్పుడు మా క‌ష్టం చూసి ఏం  చేయాలో తోచ‌క ఇటుగా రావ‌డం మానుకున్నాడ‌ని గ‌గ్గోలు పెడుతున్నారు.






పాద‌యాత్ర‌లో మీరు మా ఊరు వ‌చ్చారు. మా బాధ‌లు విన్నారు. ఆక్వా రంగానికి సంబంధించి అండ‌గా ఉంటాన‌ని లోకంలో ఉన్న మంచి మాట‌లు అన్నీ చెప్పాక మీకు ఓట్లేశాం అని వేద‌నలో ఉన్నారు మా ప్రాంతం రైతులు. సేద్యంలో జూదం ఇదే! అని చాలా మందికి తెలిసినా కూడా ఆక్వా సాగు కాస్త లాభ‌సాటి అన్న న‌మ్మ‌కంతో ఇటుగా అడుగులు వేస్తున్న వారికి ప్ర‌భుత్వం నుంచి అం దే ఊతం అంతంత మాత్ర‌మే అని తేలిపోయింది. దీంతో మా ప్రాంతం రైతులు జ‌గ‌న‌న్న పై కోపంతో ఉన్నారు. వేళ కాని వేళ‌ల్లో అన ధికార రీతిలో విధిస్తున్న లేదా అమ‌లు చేస్తున్న క‌రెంటు కోత‌లు త‌మ కొంప ముంచ‌నున్నాయ‌ని ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. తీవ్ర నిరాశ‌తో ఉన్న  మా ప్రాంతంలో ఆక్వా రంగంను ఆదుకోవాల్సిన బాధ్య‌త మాత్రం జ‌గ‌న్ దే! మా ప్రాంతం అంటే  శ్రీ‌కాకుళం అని అర్థం.


జ‌గ‌న‌న్న మాట‌లేవో వేరుగా ఉన్నాయి..కానీ గ్రౌండ్ లెవ‌ల్ లో వాస్త‌వాలు వేరుగా ఉన్నాయి. జ‌గ‌న‌న్నా! మీరు రియాల్టీ చెక్ చేసు కోవడం మ‌రిచిపోవ‌ద్దు. ఎంతో శ్ర‌మ‌ప‌డి అధికారంలోకి వ‌చ్చారు. ఇలా మాకు అంధ‌కారం మిగ‌ల్చ‌డం న్యాయ‌మా అని ప్ర‌శ్నిస్తు న్నారు మా ఊరు రైతులు. మా ఊరు అంటే శ్రీ‌కాకుళం అని అర్థం. మా ఊరు అంటే సంత‌బొమ్మాళి ప‌రిస‌ర ప్రాంతాల‌కు చెందిన ఆ క్వా రైతులు అని అర్థం. ఆ మాట‌కు వ‌స్తే సంతబొమ్మాళి మొద‌లుకుని జిల్లా చివ‌ర‌న ఉన్న ఇచ్ఛాపురం వ‌ర‌కూ అని అర్థం. జ‌గ‌న న్నా! మీరు ఆక్వా రంగానికి అందించే విద్యుత్ ను స‌బ్సిడీపై అందిస్తున్నారనే వీళ్లంతా ఈ సాగుపై ప్రేమ పెంచుకున్నా రు. కానీ ఇ ప్పుడు ఎప్ప‌టిక‌ప్పుడు కోత‌ల పేరిట విద్యుత్ అధికారులు డ్రామాలు ఆడుతున్నారు. దీంతో మూడు వేల హెక్టార్ల‌లో ఉన్న ఆక్వా సాగు, ఇందుకు సంబంధించిన రెండు వేల మంది రైతులు, ఇంకా ఎనిమిది వేల మందికి పైగా కార్మికులు రోడ్డున ప‌డిపోనున్నా రు.


ఇంకా వంద కోట్ల‌కు పైగా వ్యాపారం అంతా అన్నీ  కుదేల‌యిపోతున్నాయి. ఎక‌రా రొయ్య‌ల సాగుకు 12 నుంచి 14 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి, దీనిపైనే ఆశ‌లు పెట్టుకున్న రైతులు  మీరు చెప్పా పెట్ట‌క విధిస్తున్న కోతల కార‌ణంగానే ఏమౌతుందో తెలియ‌క, జ‌న‌రేట‌ర్ల‌తో న‌డ‌ప‌లేక అవ‌స్థ పడుతున్నారు. రొయ్య పిల్ల‌ల‌కు ఆక్సిజ‌న్ అందించే ప‌రికరాల‌కు నిరంత‌రం విద్యుత్ ఉండాల్సిందే..లేక‌పోతే రొయ్య పిల్ల‌లు చ‌నిపోతాయి. అస‌లు వీటి సాగు ఉండేదే 90 నుంచి 120 రోజులు.. మీరు విధించే కోత‌ల కార‌ణంగా ఆక్వా సాగు రంగం పూర్తిగా స‌మ‌స్య‌ల్లోకి పోతోంది. ఇప్ప‌టికైనా ఏదో ఒక‌టి ఆలోచించండి స‌ర్ ప్లీజ్ ..!


మరింత సమాచారం తెలుసుకోండి: