ఏపీలో వైసీపీ నేత‌ల మ‌ధ్య విబేధాలు కొన్ని చోట్ల తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ప‌లు జిల్లా ల‌లో ఎంపీలు వ‌ర్సెస్ ఎమ్మెల్యేలు, కొన్ని చోట్ల మంత్రులు వ‌ర్సెస్ ఎమ్మెల్యేల మ‌ధ్య ఏ మాత్రం పొస‌గ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే కీల‌క‌మైన తూర్పు గోదావ‌రి జిల్లాలో రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌ర‌త్ వ‌ర్సెస్ రాజాన‌గ‌రం ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా ల మ‌ధ్య కూడా కొద్ది రోజులుగా ఆధిప‌త్య పోరు న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ఇటీవ‌ల ఈ ఇద్ద‌రు నేత‌ల‌ను తాడేప‌ల్లి పిలిపించుకుని పార్టీ అధిష్టానం గీసిన గీత దాట‌వ‌ద్ద‌ని సుతిమెత్త‌ని వార్నింగ్ లు ఇచ్చి పంపిన‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య పైకి ఎప్ప‌ట‌కీ స‌యోధ్య కుద‌ర‌ద‌ని భావిస్తోన్న జ‌గ‌న్  ఈ ఇద్ద‌రికి షాక్ ఇచ్చేశారు.

త్వ‌ర‌లోనే రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు రానున్నాయి. అయితే రాజ‌మండ్రి కార్పోరేష‌న్ కు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని జగన్ ఇప్పటికే నేతలను ఆదేశించారు. అయితే వైసీపీలో నేతల మధ్య విభేదాలు తీవ్రంగా ఉండ‌డంతో జ‌గ‌న్ రాజా, భ‌ర‌త్ వ‌ర్గాల‌ను క‌లిపేందుకు ట్రై చేశారు. అయితే లోప‌ల మాత్రం వీరు క‌లిసే అవ‌కాశాలు లేవ‌న్న నివేదిక‌లు జ‌గ‌న్ ద‌గ్గ‌ర కు వెళ్లి పోయాయి. ఇదే ప‌రిస్థితి ఉంటే కార్పోరేష‌న్ ఎన్నిక‌ల సాక్షిగా ఈ ఇద్ద‌రు నేత‌లు ఒక‌రిని మ‌రొక‌రు దెబ్బ తీసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తార‌న్న సందేహం జ‌గ‌న్ కు వ‌చ్చేసింది.

అందుకే కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో గెలుపు కోసం జ‌గ‌న్ ఓ స‌మ‌న్వ‌య క‌మిటీని నియ‌మించాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. అంటే రేప‌టి ఎన్నిక‌ల వేళ ఈ స‌మ‌న్వ‌య క‌మిటీ సూచ‌న మేర‌కే టిక్కెట్ల కేటాయింపు ద‌గ్గ‌ర నుంచి ప్ర‌చారం .. ఇత‌ర‌త్రా వ్య‌వ‌హారాలు న‌డుస్తాయి. అంటే భ‌ర‌త్‌, రాజా ల‌కు ఈ ఎన్నిక‌ల‌లో పెత్త‌నం ఉండ‌దు. ఆ క‌మిటీ చెప్పిన వారికే టిక్కెట్ల కేటాయింపు ఉంటుంది. ఈ స‌మ‌న్వ‌య కమిటీకి మంత్రిని ఒకరు ఛైర్మన్ గా నియమిస్తారట‌. ఏదేమైనా రాజా, భ‌ర‌త్ దూకుడుకు జ‌గ‌న్ బ్రేకులు వేసిన‌ట్టే అని పార్టీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: