పౌరులు త‌మ‌కు వ‌చ్చి సందేహాలు పాల‌న‌కు సంబంధించి ఉంటే త‌ప్పక తెలుసుకోవ‌చ్చు. నిల‌దీయ‌వ‌చ్చు. ఇంకా చెప్పాలంటే కో ర్టు గుమ్మం తొక్క‌వ‌చ్చు. కానీ ఇక్క‌డ ఆ సౌల‌భ్యం ఏమీ లేద‌న‌కోండి. స‌మాచార హ‌క్కును పూర్తిగా రాష్ట్రంలో భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నా రన్న అప‌వాదు మాత్రం జ‌గ‌న్ ఖాతాలో ఉంది. ఆన్లైన్ లో వివ‌రాలు కోరే అవ‌కాశం ఇప్ప‌టిదాకా ఒక్క‌టంటే ఒక్క కార్యాల‌యం ఇ వ్వడం లేదు. దీంతో ఏద‌యినా స‌మాచారం కోరాలంటే ఆఫీసుల చుట్టూ తిర‌గాల్సిందే.


 గ‌తంలో స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద ప‌ని చేసేందుకు కార్యాల‌యాల్లో ఇద్ద‌రు అధికారులను అందుబాటులో ఉంచేవారు. వారి పేర్ల‌ను సైతం అక్క‌డున్న గోడ‌ల‌పై రాయించే వారు. పౌర స‌మాచార అధికారి, స‌హాయ పౌర స‌మాచార అధికారి పేరిట ఆఫీసులో ఇద్ద‌రు త‌ప్ప‌క అందుబాటు లో ఉండాల్సిందే న‌ని చ‌ట్టం చెబుతోంది. ఇప్పుడు కూడా వారు ఉంటున్నారు కానీ ఆశించిన స్థాయిలో ప‌ని మాత్రం చేయ‌డం లేదు. వీరిపై జిల్లా స్థాయిలో క‌లెక్ట‌ర్, ఇతర ఉన్న‌తాధికారులు అప్పిలేట్ అధికారులుగా ఉంటారు. ఇంకా వివిధ స్థాయిల్లో క‌మిష‌న‌ర్లు ఉంటారు.


వీరిని ఆశ్ర‌యించి స‌మాచారం తీసుకోవాల‌న్నా నానా తంటాలూ ప‌డాల్సిందే. స‌మాచార హ‌క్కు చ‌ట్టం అమ‌లుపై గ‌డిచిన ఏడున్న‌రేళ్లుగా అస్స‌లు దృష్టే లేదు. యూపీఏ హ‌యాంలో య‌జ్ఞంలా చేప‌ట్టిన స‌మాచార హ‌క్కు చ‌ట్టం నిర్వ‌హ‌ణ త‌రువాత
కాలంలో క‌నుమ‌రుగ‌యిపోయింది. ఇక జ‌గ‌న్ స‌ర్కారు ఆన్లైన్ లో ఏవివ‌రం అందుబాటులో ఉంచ‌డం లేదు. ఇక అప్లికేష‌న్ మాత్రం ఎందుకు తీసుకుంటార‌ని?


స‌మాచార హ‌క్కు చ‌ట్టం ప్ర‌కారం ఏద‌యినా వివ‌రం కోరాలన్నా, తెలుసుకోవాల‌న్నా ఆఫీసులు చుట్టూ తిరిగే ప‌నే లేకుండా ఆన్లైన్ ను ఆశ్ర‌యించ‌వ‌చ్చు అన్న‌ది కేంద్రం ఆలోచ‌న. ఇప్ప‌టికే ముఖ్య‌మ‌యిన జీఓల‌ను ఆన్లైన్ లో ఉంచ‌కుండా జ‌గ‌న్ ప్ర‌భుత్వం దాగు డు మూత‌లు ఆడుతుంద‌న్న విమ‌ర్శ ఒక‌టి ఎప్ప‌టి నుంచో వినిపిస్తోంది. దీనికి తోడు సమాచార హ‌క్కు చ‌ట్టం ప్ర‌కారం వివరాలు తెలుసుకోవాల‌న్నా, ఫిర్యాదు చేయాల‌న్నా కార్యాల‌యాల చుట్టూ తిర‌గ‌క త‌ప్ప‌ని దీనావ‌స్థ త‌మ‌ది అని కొంద‌రు అర్జీదారులు (అప్లి కెంట్స్‌) త‌మ గోడు వినిపిస్తున్నారు. వాస్త‌వానికి ఆన్లైన్ ద్వారా స‌మాచారం అడిగేందుకు కేంద్రంకు చెందిన కార్యాల‌యాల‌న్నింటిలో నూ అనుమ‌తి ఉన్నా, అందుకు త‌గ్గ సౌల‌భ్యం ఉన్నా ఇక్క‌డ మాత్రం అవేవీ లేవు. ఒక‌వేళ అడిగినా ప‌ట్టించుకునేవారే లేరు. మ‌రి! పాల‌న‌లో పార‌దర్శ‌క‌త ఎలా వ‌స్తుంది?

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp