షాపింగ్ మాల్ అంటే మీకందరికీ తెలుసు... ఎంత బిజీగా ఉంటుందో. అసలే పండుగ సీజన్. ఇంకేముందీ కస్టమర్లు రకరకాల బట్టల కోసం షాపులకు ఎగబడతారు. ముఖ్యంగా ప్రముఖ షాపింగ్ మాల్స్ కే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఈ మధ్య కాలంలో విపరీతమైన రద్దీగా ఉంటున్నాయి షాపింగ్ మాల్స్. కస్టమర్లకు రకరకాల బట్టలను చూపిస్తూ.. వర్కర్స్ కూడా బిజీ అయిపోయారు. క్షణం తీరికలేకుండా.. కస్టమర్లను డిసప్పాయింట్ చేయకుండా పనిచేస్తున్నారు. కనీసం నీళ్లు కూడా తాగేంత సమయం కూడా లేకుండా బిజీగా గడిపేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఓ షాపింగ్ మాల్ లో ఊహించని ఘటన ఎదురైంది.  

ఇటీవలే ఓపెన్ అయిన ఈ షాపింగ్ మాల్ కు కస్టమర్లు పోటెత్తారు. కస్టమర్లకు అడిగిన దుస్తులను చూపిస్తూ వర్కర్లు బిజీ గా ఉన్నారు. అంతలోనే ఎవరూ ఊహించని పరిస్థితి ఎదురైంది. షాపింగ్ మాల్ కు చెందిన ఓ ఉద్యోగి కస్టమర్లకు కొత్త బట్టలు చూపిస్తూనే టేబుల్ పై కుప్పకూలిపోయాడు. దీంతో కస్టమర్లు.. తోటి ఉద్యోగులు షాక్ గురయ్యారు. ఏం జరిగిందో తెలియక షాపింగ్ మాల్ లో అలజడి చెలరేగింది. తోటి ఉధ్యోగులు అతడిని పట్టుకొని చేతులు రుద్దడం.. హార్ట్ ప్రెస్ చేయడం లాంటివి చేశారు. కానీ జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ఆస్పత్రికి తరలించగా ఆ ఉద్యోగి చనిపోయినట్టు నిర్ధారించారు వైద్యులు. గుండెపోటుతోనే చనిపోయినట్టు సమాచారం. దీంతో షాపింగ్ మాల్ ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అప్పటి వరకు తమతో పాటు విధులు నిర్వర్తించిన వ్యక్తి ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అటు మృతుని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో గుండె జబ్బు సమస్యలు అధిగమవుతున్నాయి. ఒకప్పుడు ఆరు పదులు దాటిన తర్వాతే ఇలాంటి సమస్యలు వచ్చేవి. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. 25ఏళ్లు దాటిన తర్వాత ఎప్పుడైనా వచ్చే ప్రమాదముంది.
షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, మానసిక ఒత్తిడి ప్రధానంగా హార్ట్ అటాక్ కు దారి తీస్తున్నాయి. రక్త ప్రసరణ స్థాయి సాధారణం కంటే తక్కువగా ఉండటం వల్లే ఇలాంటి ప్రమాదం జరుగుతోంది. పెళ్లి కానివారే ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పెళ్లైన వాళ్లతో పోల్చితో పెళ్లికాని వారిలో 40శాతం గుండెజబ్బులకు లోనయ్యే ప్రమాదముందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి గుండెజబ్బుల బారిన పడకుండా.. వ్యాయామం చేయడం.. ఆయిల్ ఫుడ్ తగ్గించడం లాంటివి చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: