తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒంటరయ్యారు అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది. బండి సంజయ్ గత కొంత కాలంగా ఆ పార్టీని గాడిలో పెట్టేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేయడం కాకుండా పాదయాత్ర కూడా చేయడం మనం చూశాం. పార్టీ ప్రస్తుతం కష్టాల్లో ఉన్న నేపథ్యంలో బండి సంజయ్ కాస్త దూకుడుగా ముందుకు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు మంత్రులు టార్గెట్గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత బండి సంజయ్ కి పార్టీలో ప్రాధాన్యత పెరిగింది.

అయితే ఇప్పుడు బండి సంజయ్ కాస్త దూకుడుగా ముందుకు వెళ్లకుండా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తూ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా సరే ఈటల రాజేందర్ ను గెలిపించాలని పట్టుదలగా ఉన్నారు. అయితే బండి సంజయ్ కి కావాల్సిన సహకారం అందడం లేదని రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి అదే విధంగా మిగిలిన ముగ్గురు ఎంపీల నుంచి ఆయనకు సహకారం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. నిజామాబాద్ ఎంపీ అలాగే అదిలాబాద్ ఎంపీల నుంచి ఆయనకు సహకారం లేకపోవడం అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లేదు అనే వ్యాఖ్యలు రాయడం బండి సంజయ్ తో పాటుగా క్యాడర్ ను కూడా ఇబ్బంది పెడుతున్న అంశం.

దీనితో బండి సంజయ్ ఒంటరయ్యారు అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది. పార్టీ నాయకులు చాలామంది ఈ మధ్యకాలంలో దూకుడుగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేసినా సరే కొన్ని కారణాలవల్ల వెనక్కి తగ్గారు. తాము ఎంత కష్టపడినా బండి సంజయ్ కు పేరు వస్తుంది అనే అభిప్రాయంలో కూడా కొంతమంది నాయకులు ఉన్నారు అని వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. మరి దీనిని బీజేపీ ఏవిధంగా అధిగమిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp