విజయవాడలో ఇప్పుడు వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్ పై అనేక చర్చలు జరుగుతున్నాయి. వంగవీటి రాధా ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తారు ఏంటనే దానిపై పార్టీ నాయకులు కూడా ఒక స్పష్టత లేకపోవడం గమనార్హం. టిడిపి లోకి వచ్చిన తర్వాత వంగవీటి రాధా చేస్తున్న కార్యక్రమాలు కూడా పెద్దగా ప్రజల్లోకి వెళ్లే విధంగా లేకపోవడం ఆశ్చర్యపరుస్తున్న అంశం. పార్టీలో చాలామంది నాయకులు దూకుడుగా ముందుకు వెళ్తున్న వంగవీటి రాధ మాత్రం పెద్దగా స్పందించే ప్రయత్నంగా నీ పార్టీ కోసం కష్టపడి ప్రయత్నాలు చేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇటీవల గుడివాడ నియోజకవర్గంలో వంగవీటి రాధా పోటీ చేసే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ వంగవీటి రాధా పెద్దగా పార్టీకి ఉపయోగపడే విధంగా గుడివాడ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేయక పోవడమే కాకుండా మంత్రి కొడాలి నాని తో కలిసి తిరుగుతున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందని వైసీపీలో చేరేందుకు కొడాలి నాని సహాయ సహకారాలు అందిస్తారని కొంతమంది వ్యాఖ్యలు చేశారు. అయితే పార్టీ మారే అంశం గురించి వంగవీటి రాధ మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ఆయన సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ కోసం పని చేయడం కంటే కూడా తాను వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తే వచ్చే ఓట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి తాను గెలుస్తారా లేదా అలాగే సొంత సామాజిక వర్గం లో ఎంత వరకు తనకు పట్టు ఉంది అనే దానిపై ఆయన సర్వే చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక ప్రైవేటు సంస్థ తో వంగవీటి రాధా ఈ సర్వే చేయిస్తున్నారని సర్వేలో వచ్చిన ఫలితం ఆధారంగా ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉండవచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: