ఏపీలో విద్యుత్ సంక్షోభం ఏమి లేదు అదంతా అనవసరంగా కొందరు చేస్తున్న విషప్రచారం అంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఆగిందని, త్వరలో విద్యుత్ కోతలు విపరీతంగా ఉంటాయని కొందరు కావాలనే రాష్ట్రంపై అసత్య ప్రచారం చేస్తున్నారని వారు చెప్పారు. కేవలం పండుగలు అని ఈ కోతలు లేవని ఈ ప్రచారంలో చేర్చారని, అందుకే ప్రజలకు ఈ అసత్యప్రచారాలపై స్పష్టత ఇచ్చేందుకు ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. పండగ రోజులు కావచ్చు అనంతరం కావచ్చు కోతలు ఏమి ఉండవు. బొగ్గు కొరత వచ్చే లోపే కావాల్సిన నిల్వలను ఏర్పాటు చేసుకునే విధంగా రాష్ట్రప్రభుత్వం విద్యుత్ శాఖకు నిధులు కేటాయించినట్టు ఆ శాఖ కూడా స్పష్టం చేసింది.

అలాగే కేంద్రం కూడా తగిన విధంగా దిగుమతులను పెంచుతున్నట్టు, ఇకనుండి రాష్ట్రాలకు తగిన విధంగా పంపిణి కూడా జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటివరకు సంక్షేమం రాకుండా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నట్టు ఆ శాఖ స్పష్టం చేసింది. అలాగే కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేకంగా 8 బొగ్గు రైళ్లు కేటాయించింది, అలాగే దేశంలో ఎక్కడ బొగ్గు లభ్యత ఉన్నప్పటికీ కొనుగోలు చేసుకునే సౌలబ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వల్పకాలిక మార్కెట్ నుండి ధరతో నిమిత్తం లేకుండా కొనుగోలు చేయలని ఆదేశాలు ఏపీ జెన్కో కు ప్రభుత్వం జారీచేసింది.

రాష్ట్రప్రభుత్వం కేంద్ర విద్యుత్ సంస్థల నుండి ఎవరికి కేటాయించబడని విద్యుత్ నుండి వచ్చే సంవత్సరం జూన్ వరకు ఏపీకి  400 మెగావాట్ల మేర కేటాయించాలని ఇప్పటికే ఆయా శాఖలకు దరఖాస్తు చేయడం జరిగింది. బొగ్గు కొనుగోలు  చెల్లించాల్సిన బకాయిలతో నిమిత్తం లేకుండా ఆయా సంస్థలు బొగ్గును సరఫరా చేసేందుకు కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. తెలంగాణాలో ఉన్న సింగరేణి నుండి కూడా బొగ్గు కోసం సమన్వయము చేసుకోవడం జరిగింది. కేంద్రం నుండి కూడా రాష్ట్రంలో ఉన్న ధర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా కోసం తగిన ప్రయత్నాలు  రాష్ట్రంలో కొత్తగా విటిపిఎస్, కృష్ణపట్నం లోను 800 మెగావాట్ల ధర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసి, త్వరగా అందుబాటులోకి తేనున్నారు. కాబట్టి రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం వచ్చే అవకాశం లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మరియు ప్రభుత్వాలు స్పష్టం చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: