సిడబ్ల్యుసి నిర్ణయాలను కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ మీడియాకు వివరించారు. తాజా రాజకీయ పరిస్థితులు, ద్రవ్యోల్బణం, రైతులపై జరుగుతున్న దాడులపై తీర్మానాలు చేసామని అన్నారు. సంస్థాగత ఎన్నికలపై నిర్ణయం తీసుకున్న సిడబ్ల్యుసి... త్వరలో కాంగ్రెస్ పార్టీలో నాయకుల దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు భారీగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా పార్టీ సిద్ధాంతాలు, విధానాలు,కాంగ్రెసు కార్యకర్తల నుంచి పార్టీ ఆశిస్తున్న అంచనాలు, ఎన్నికల నిర్వహణ, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు,ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన విధానం పై శిక్షణ ఇచ్చామని తెలిపింది.

పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ పై వివరణాత్మకంగా చర్చించింది. 2021 నవంబర్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా సాగనున్న కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు ఆయన. 2022 ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య ఖరారు కానున్న డిసిసి ఎన్నికలకు  పోటీ పడే అభ్యర్థుల జాబితా ఉంటుందని ఎన్నిక ఏప్రిల్ 16 నుంచి మే 31 వరకు ప్రాధమిక కమిటీలు,బూత్ కమిటీలు,బ్లాక్ కమిటీల అధ్యక్షుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. జులై 21 నుంచి 20 ఆగస్ట్ వరకు పిసిసి,ఉపాధ్యక్షులు,కోశాధికారి,పిసిసి కార్యదర్శి వర్గం, ఏఐసిసి సభ్యులు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.

2022 ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్  20 వరకు ఏఐసిసి అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని తెలిపారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో  ప్లినరి సమావేశం సందర్భంగా సిడబ్ల్యుసి సభ్యులు,ఏఐసిసి కమిటీల అధ్యక్షుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై సిడబ్ల్యుసి చర్చించింది అని వివరించారు. ధరల పెరుగుదల పై నవంబర్ 14 నుంచి 29 వరకు దేశవ్యాప్త ఆందోళన చేపట్టాలని సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టడంపై సుముఖంగా రాహుల్ గాంధీ ఉన్నారని ఆయన చెప్పారు. సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నేతలకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: