చైనా ఇటీవల క్షిపణి(అణుఆయుధం) ప్రయోగాన్ని చేసింది. అది కూడా లాంగ్ రేంజ్ లో ఉన్న ప్రాంతాలను లక్ష్యాలను చేసుకుని ఈ ప్రయోగాలు చేసింది. అయితే అందరు అది అమెరికా కోసం అని అంటుకుంటున్నప్పటికీ, దానితో భారత్ కు కూడా ప్రమాదమే అని నిఘా వర్గాలు తెలియజేస్తున్నాయి. దీనితో భారత్ కూడా తగిన విధంగా చైనా కు సమాధానం చెప్పాలని అనుకుంది, అందుకే ఇటీవల అగ్ని5 క్షిపణి ప్రయోగాన్ని ఆఖరి నిముషంలో ఆపాల్సివచ్చింది. అయితే దానికి కారణంగా ఒత్తిడి కూడా అయిఉండవచ్చు అనేది అంతర్జాతీయంగా ఉన్న అభిప్రాయం. రష్యా మొదటి నుండి భారత్ తో స్నేహం చేస్తున్నట్టే ఉంటూ మరోవైపు వెనుక నుండి గోతులు కూడా తీసే రకంగా ప్రవర్తిస్తూనే ఉంది. అందుకే చైనా లేదా రష్యా లాంటి దేశాల ఒత్తిడితో ఆ ప్రయోగం ఆగి ఉండవచ్చు అంటున్నారు నిపుణులు.

అయితే తాజాగా భారత్ కూడా అగ్ని5 ఆగినప్పటికీ వెనుకంజ వేయకుండా చైనా మాదిరి లాంగ్ రేంజ్ క్షిపణిని పరీక్షించడానికి సిద్ధం అవుతుంది. భారత్ మాత్రం ఈ ప్రయోగం కోసమే అగ్ని5 ని ఆపి ఉండవచ్చు. భారత్ లాంగ్ రేంజ్ క్షిపణిని కే5 సూపర్ బాలిస్టిక్ గా పిలుస్తున్నారు. అతిత్వరలో ఈ ప్రయోగం చేయనున్నట్టు భారత్ ప్రకటించింది. దీనితో బంగాళాఖాతం నుండి నేరుగా చైనీస్ యుద్ధ నౌకలను భస్మీపటలం చేసే సత్తా ఈ క్షిపణికి ఉంది. ఈ ప్రయోగంతో భారత్ కూడా క్షిపణి ప్రయోగం ద్వారా భయపెట్టాలని చూసిన చైనాకు తగిన సమాధానం ఇచ్చినట్టు అవుతుంది.

అయితే ఈ విధంగా పోటీతత్వం మరొక దానిలో ఉంటె దేశాలు అభివృద్ధి వైపు శాంతివైపు నడిపించవచ్చు. ఇందులో భారత్ ముందుంటుంది, కానీ తమబ్రతుకు మాత్రం బాగుంటే చాలు అనుకుంటే చైనా లాంటి దేశాలు మాత్రం ఇందుకు సహకరించకపోవటం వలననే ఇప్పటి వరకు సుస్థిరమైన శాంతి సాధించలేకపోయింది ప్రపంచం. ఉమ్మడి కార్యాచరణ అంటూ ప్రపంచ దేశాలు కలిసి నెడుతున్న మాట నిజమే అయినప్పటికీ అవన్నీ శాంతి ని ఉద్దేశించినట్టు లేవు, కనీసం పేదరికాన్ని నిర్ములించుకునే స్థితిలో కూడా ప్రపంచ దేశాలు కలిసి పనిచేయలేకపోతున్నాయంటేనే ఆయా దేశాల మానసిక స్థితి గతులు అర్ధం అవుతున్నాయి. కొన్ని దేశాల ముర్కత్వం వలన నేడు ఆఫ్ఘన్ లో పరిస్థితులు ఉన్నట్టే, ప్రపంచంలో పేదరికం ఇన్ని దశాబ్దాలుగా కూడా అలాగే ఉండిపోయింది. ఇన్ని దేశాల మధ్య ఒక్క మూర్ఖ దేశం ఉంటె పరిస్థితి ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: