ఒక దేశం పరిస్థితులను మరోదేశం శాసించడానికి మార్గాలు అనేకం కనిపెడుతున్నాయి శత్రుమూకలు. చిన్న చిన్న విషయాలను కూడా క్షుణ్ణంగా ఆలోచించి మరి ఈ పనులకు పాల్పడుతున్నారు కొందరు మూర్ఖులు. అందులో ప్రధానంగా భారత్ పై ఏడ్చి చచ్చేది చైనా. దానిని ఎక్కడ భారత్ దాటిపోతుందో అనేది దాని పెద్ద ఏడుపు. అందుకే ఎలాగూ దానిపరిస్థితి కుదేలైపోయింది, మరి పక్కన వాడిని కూడా పైకి ఎదగకుండా చేయాలని కాళ్లుపట్టుకు లాగుతుంది. కాళ్ళమీదపడటం, కాళ్లుపట్టుకోవడం లాంటివి ఆ పని చేసేవారికి బాగానే ఉంటుంది, మిగిలిన వారికి మరోలా ఉంటుంది. ఎవరి కాళ్ళమీద పడ్డామో వాళ్ళ మనసులో మరొకటి ఉంటుంది. అలాగే చైనా కళ్ళు పట్టుకుందని సంతోషం వ్యక్తం చేసేయకూడదు. అది పట్టుకుందే లాగటానికి అనేది గుర్తుపెట్టుకొని, అసలు అలాంటివారిని దగ్గరకు కూడా రానీయకుండా ఉండాలి.

భారత్ లో ఉన్న ప్రభుత్వం దిగిపోతే కానీ తన ఆటలు సరిహద్దులలో సాగవని చైనా భావిస్తుంది. అందుకే భారత్ లో గందర గోళం సృష్టించడానికి అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగానే ఎక్కడ ఏ అవకాశం దొరికినా చక్కగా ఉపయోగించుకుంటుంది. రూపాయి ఇస్తాం అంటే ఎవరైనా సొంత దేశాన్ని అమ్ముకునే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితులలో చైనా భారత్ అంతర్గత వ్యవరాలలో జోక్యం చేసుకోవడం పెద్ద విషయం ఏమి కాదు. కూర్చున్న చోటునుండి అంతా నడిపించే విధంగా పరిస్థితులు ఉన్నాయి. అందుకే ప్రతిక్షణం కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తుంది.

తాజాగా ఏముంది, ఎప్పుడు ఎవరో ఒకరి సరిహద్దులలో ఎదో ఒక హడావుడి చేయడం చైనాకు అలవాటే. అలా చేయడం వెనుక అది వెతుక్కునే కారణమే చాలా ఛండాలంగా ఉంది. సరిహద్దులలో కవ్వింపు చర్యలకు దిగటం వలన అక్కడ అధిక సైన్యాన్ని మోహరించాల్సి వస్తుంది. అదొక ఆర్థికపరమైన భారమే కదా, అలా చైనా ఎన్ని రోజులు సరిహద్దులలో ఉంటె, భారత్ సైన్యం కూడా అన్ని రోజులు అక్కడ ఉండాల్సి వస్తుంది. ఇక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి, కేంద్రం మళ్ళీ ఆదాయం కోసం పన్నులు పెంచుతుంది, ధరలు పెరుగుతాయి. తద్వారా  ప్రజలలో ప్రభుత్వం పై నిరసన లు వెల్లువెత్తుతాయి, రాబోయే ఎన్నికలలో ఈ నిరసనల తో ఈ ప్రభుత్వం ఉండకపోవచ్చు అనేది చైనా చీప్ వ్యూహం. ఇక ప్రాంతీయంగా కాస్త ధరలు పెరిగితే విపక్షాలు చేసే యాగీ అంతా ఇంతా ఉండదు, ఇవ్వన్నీ దానికి కలిసి వచ్చే అంశాలు. ఇలా కూర్చున్న చోటు నుండి కదలకుండా కొన్ని దరిద్రపు దేశాలు ఇతర దేశాలపై పన్నాగాలు పన్నుతూ కూర్చున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: