ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది మంత్రులు ఈ మధ్యకాలంలో నియోజకవర్గాలకు రాకుండా ఎక్కువగా హైదరాబాద్ లేదా బెంగళూరు లేదా చెన్నై లేదా భువనేశ్వర్లో ఎక్కువగా ఉంటున్నారు అని కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. పార్టీ పటిష్టంగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ప్రజల్లో ఎక్కువ ఆదరణ ఉన్న తరుణంలో పార్టీలో ఉన్న కీలక నాయకులు గా ఉన్నటువంటి మంత్రులు ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అనే వ్యాఖ్యలు ఎక్కువగా వైసిపి కార్యకర్తలలో కూడా వినిపించాయి. ముఖ్యమంత్రి ఎంత కష్టపడినా సరే ఇటువంటి వైఖరి వల్ల పార్టీకి ఎటువంటి ఉపయోగం లేదనే వ్యాఖ్యలు కూడా మనం చూశాం.

అయితే సొంత వ్యాపారాలు మీద ఎక్కువగా దృష్టి పెట్టిన మంత్రులు ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎక్కువగా భయపడుతున్నారని అందుకే చాలామంది నాయకులు నియోజకవర్గాలకు వచ్చేశారని అంటున్నారు. చాలామంది కీలక నాయకులు ఈ మధ్యకాలంలో పార్టీ కార్యక్రమాల విషయంలో దూకుడుగా లేకపోవడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను బాగా ఇబ్బంది పెడుతున్న అంశం. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రులు ప్రజలలోకి వెళ్లాల్సింది ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు.

దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు మంత్రులు వ్యాపారాలను సొంత కుటుంబ సభ్యులకు అప్పగించి బెంగళూరు అలాగే హైదరాబాద్ నుంచి వచ్చేసారు  అని మరికొంతమంది మంత్రులూ చెన్నైలో కూడా ఉన్నారని అలాగే విజయవాడ లో ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు వాళ్లు కూడా సొంత నియోజకవర్గానికి వెళ్లి పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్నారని వాళ్ళందరినీ కూడా గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రతి ఒక్క నాయకుడి మీద సర్వేలు చేయించుకున్న నేపథ్యంలో వాళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా పార్టీని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఇది తెలుగుదేశం పార్టీని ఎంతవరకు ఇబ్బంది పెడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: