ఎన్నికల్లో గెలుపు ఎపుడూ భారంగా ఉంటుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్నపుడు గెలుపు అలుపు లేకుండా దక్కుతుంది. అయితే అక్కడే తేడా కూడా కొడుతుంది. అది అంత సులువుగా దక్కినా కూడా అసలైన కధలు మాత్రం ఏ ఒక్కటీ చెప్పదు.

చాప కింద నీరులా దాగున్న అసంతృప్తిని కూడా పట్టుకోదు. ఇక బంపర్ మెజారిటీలు దక్కిన వారికి వచ్చిన చిక్కు ఏంటి అంటే అన్నీ మనకే, అంతా మన మంచికే అనుకుంటూ దూకుడుగా పోతారు. ఏపీలో వైఎస్ జగన్ సర్కార్ విషయం కూడా ఇపుడు అలాగే ఉంది అని చెప్పాలేమో. ఎన్నికలలో విజయాలు అన్నీ ఆ పార్టీవే. 2019 నుంచి మొదలు పెడితే లోకల్ బాడీ ఎన్నికలు, తిరుపతి బై పోల్. రేపటి బద్వేల్ బై పోల్ కూడా వైసీపీదే విజయం. మరి అలాగని జనాలంతా ఆ పార్టీ వైపు ఉన్నారా అంటే డౌటే అంటున్నారు.

ఏపీలో మెల్లగా వైసీపీ మీద వ్యతిరేకత మొదలైందా అంటే అవును అనే అంటున్నారు. అది రాజకీయ పార్టీల కదలికలు, నేతల ఆలోచనల నుంచి చూడాలి. ఏపీలో మెల్లగా వైసీపీకి దూరమవుతున్న వారు ముందు నాయకులే. కడప జిల్లాలో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి వైసీపీ మీద వస్తున్న వ్యతిరేకతను అంచనా వేసుకునే జాగ్రత్తపడుతున్నట్లుగా భావించాలి.అదే విధంగా ఆయన వచ్చే ఎన్నికల్లో టీడీపీ ద్వారా పోటీకి రెడీ అవుతున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. అధికార పార్టీ ప్రతినిధిగా ఉన్న జి వెంకటరెడ్డి అనే ప్రకాశం జిల్లాకు చెందిన నాయకుడు ఇపుడు టీడీపీ వైపు చూస్తున్నారు. ఆయన కాంగ్రెస్ కి గుడ్ బై కొడుతున్నారు. ఈ నెల 21న టీడీపీలో చేరుతున్నారు. చిత్రమేంటి అంటే ఈ ఇద్దరు నేతలు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు. ఇలాగే రెడ్లలో ఇంకా చాలనే  అసమ్మతి ఉంది అంటున్నారు. మరో వైపు కాపులు కూడా యాంటీ అవుతున్నారా అన్న చర్చ ఉంది.

జగన్ మీద అతి భక్తితో మంత్రి పేర్ని నాని నేను ఆయనకు పాలేరుని అంటూ ఈ మధ్యన  చేసిన కామెంట్స్ నానికి ఏమో కానీ వైసీపీకి జగన్ కి తీరని హాని చేయబోతున్నాయని అంటున్నారు. కాపుల ఆత్మగౌరవం అన్న నినాదం ఒకటి బయల్దేరుతోంది. ఇక బీసీలు చూస్తే వారు కూడా రాజ్యాధికారం కోరుకుంటున్నారు. వారు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. మొత్తానికి చూస్తే ఎదురులేదు అనుకుంటున్న వైసీపీకి ఇపుడు అన్ని వైపుల నుంచి వ్యతిరేకత మొదలైందా అన్న చర్చ అయితే ఉంది. ఇక కొత్త ఏడాది అదే 2022 నాటికి ఇది మరింత గట్టిపడితే మాత్రం కీలకమైన పరిణామాలే ఏపీలో సంభవిస్తాయి అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp