తెలుగుదేశం పార్టీ వయసు నాలుగు పదులకు చేరువ అవుతోంది. అయినా కొత్తదనం కోసం ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను మెచ్చుకుని తీరాల్సిందే. టీడీపీ ఎప్పటికపుడు తన వ్యూహాలను మార్చుకుంటోంది. అలా ముందుకు సాగుతోంది.

ఇక 2019 ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీలో చాలానే మార్పు వచ్చింది. మరో వైపు చూస్తే వచ్చే ఎన్నికల నాటికి పార్టీని యువ తెలుగు దేశంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు చూస్తున్నారు. పార్టీలో మొదట్లో చేరిన వారంతా ఏనాడో షష్టి పూర్తి వయసు దాటేశారు. చాలా మంది డెబ్బైల్లోకి వచ్చేశారు. దాంతో వచ్చే ఎన్నికల్లో కొత్త వారికి యువకులకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారుట.

దాని కోసం ఆయన ఇప్పటి నుంచే వడపోత పోస్తున్నరు. కసరత్తు కూడా గట్టిగానే చేస్తున్నారు. అదే విధంగా పార్టీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఉపయోగించుకోని వారిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టాలనుకుంటున్నారుట. ఇక పార్టీ అధికారంలో ఉన్నపుడు పదవులు అనుభవించి విపక్షంలోకి రాగానే పూర్తిగా సైడ్ అయిపోయి ఎన్నికల వేళ టికెట్ కోసం వచ్చే వారిని కూడా తప్పించాలని చూస్తున్నారుట. వారు ఎంతటి పెద్ద నాయకులు అయినా సరే వద్దు అనుకుంటున్నారుట.

ఈసారి ఎన్నికలు చావో రేవో కాబట్టి ఆచీ తూచీ వ్యవహరించాలని బాబు ఆలోచిస్తున్నారుట. అందువల్ల మోహమాటాలు అసలు లేవు అంటున్నారు. ఈ మధ్యనే చంద్రబాబు ఏపీలోని కొన్ని జిల్లాల్లోని నియోజకవర్గాలలో  ఇంచార్జులను నియమించారు. అయితే దాని మీద పాతవారికి వ్యతిరేకత వచ్చినా ఆయన పట్టించుకోవడంలేదు అంటున్నారు. మరో వైపు చూస్తే వైసీపీ అధికారంలో ఉంది. ఆర్ధికంగా బలంగా ఉంది. దాంతో ఆ పార్టీని తట్టుకోవాలంటే రాటూ పోటులకు ధీటుగా నిలిచే వారినే అభ్యర్ధులుగా ఎంపిక చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారుట. మొత్తానికి అన్ని వైపుల నుంచి బాబు గట్టి కసరత్తునే చేస్తున్నారు అనుకోవాలి. మొత్తానికి గెలుపే మంత్రంగా బాబు చేస్తున్న ఈ ప్రయోగం ఏ రకమైన ఫలితాలను ఇస్తుందో చూడాల్సిందే.




మరింత సమాచారం తెలుసుకోండి: