ఏపీ రాజకీయాల్లో తక్కువ సమయంలోనే అదృష్టం బాగా కలిసొచ్చిన నాయకుల్లో సీదిరి అప్పలరాజు ఒకరు. ఈయనకు మండలి రద్దు అనే అంశం అదృష్టం రూపంలో కలిసొచ్చింది. అసలు మొదట జగన్ రూపంలో బాగా లక్ కలిసింది. 2019 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి అప్పలరాజు విజయం సాధించారు. అది కూడా శ్రీకాకుళంలో ఒక బలమైన రాజకీయ కుటుంబంగా ఉన్న గౌతు ఫ్యామిలీపై గెలిచారు. గౌతు లచ్చన్న వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన శ్యామ్ సుందర్ శివాజీ....తెలుగుదేశం పార్టీలో అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు.

2014లో కూడా పలాస నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే శివాజీకి వయసు మీద పడటంతో ఆయన రాజకీయ వారసురాలుగా శిరీష యాక్టివ్ అయ్యారు. మొదట నుంచి తండ్రికి అండగా రాజకీయాలు చేస్తున్న శిరీష...2019 ఎన్నికల్లో టి‌డి‌పి తరుపున పలాసలో పోటీ చేసి అప్పలరాజు చేతిలో ఓడిపోయారు. ఇక అలా గౌతు ఫ్యామిలీకి చెక్ పెట్టిన అప్పలరాజుకు మంత్రి పదవి కూడా దక్కింది. మండలి రద్దు నేపథ్యంలో మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ, మంత్రి పదవికి రాజీనామా చేశారు. మోపిదేవికి జగన్ రాజ్యసభ పదవి ఇవ్వగా, మోపిదేవి సామాజికవర్గానికి చెందిన అప్పలరాజుకు మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి వచ్చాక అప్పలరాజు దూకుడు మరింత పెరిగింది. అసలు చంద్రబాబుపై ఎలాంటి విమర్శలు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అటు తన సొంత నియోజకవర్గం పలాసలో గౌతు శిరీషకు చెక్ పెట్టడానికి అప్పలరాజు చేయని రాజకీయం లేదు. కానీ అదే అప్పలరాజుకు రివర్స్ అయ్యేలా ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేగా, మంత్రిగా అప్పలరాజుకు మంచి మార్కులు పడటం లేదు...పైగా నియోజకవర్గంలో అప్పలరాజు అనుచరులు చేసే రచ్చ అంతా ఇంతా కాదని టి‌డి‌పి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పలాసలో అక్రమాలు పెరిగిపోయాయని అంటున్నారు. ఇటు శిరీష కూడా దూకుడుగా ఉంటున్నారు. ఈ పరిణామాలు కాస్త అప్పలరాజుకు మైనస్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే నెక్స్ట్ ఎన్నికల్లో అప్పలరాజుకు శిరీష చెక్ పెట్టేలా ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp