తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక...కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ సత్తా చాటుతూనే వస్తుంది..కానీ కొన్ని నియోజకవర్గాల్లో టి‌డి‌పి గెలుపుకు దూరమైంది. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో టి‌డి‌పి గెలుపుకు దూరమైంది. అలా టి‌డి‌పి గెలుపుకు దూరమైన నియోజకవర్గాల్లో బొబ్బిలి కూడా ఒకటి. పార్టీ పెట్టిన మొదట్లో ఇక్కడ టి‌డి‌పి మంచి విజయాలే సాధించింది.

1983, 1985, 1994 ఎన్నికల్లో మాత్రం గెలిచింది. ఆ మూడుసార్లు టి‌డి‌పి తరుపున శంబంగి చిన అప్పలనాయుడు గెలిచారు. కానీ ఆ తర్వాత నుంచి బొబ్బిలిలో టి‌డి‌పి గెలుపుకు దూరమైంది. 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వస్తుంది..అంటే ఐదు ఎన్నికల్లో టి‌డి‌పి ఓడిపోయింది. అయితే 2014లో వైసీపీ తరుపున గెలిచిన సుజయకృష్ణరంగరావు టి‌డి‌పిలోకి వచ్చి మంత్రి కూడా అయ్యారు. కానీ ఆయన 2019 ఎన్నికల్లో టి‌డి‌పి తరుపున పోటీ చేసి ఓడిపోయారు. గతంలో టి‌డి‌పి తరుపున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అప్పలనాయుడు...వైసీపీ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇప్పుడు శంబంగి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేగా శంబంగికి పెద్దగా మంచి మార్కులు పడటం లేదు. ఇటీవల వచ్చిన పలు సర్వేల్లో కూడా శంబంగిపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని తేలింది. ఏదో ప్రభుత్వ పథకాలు మినహా, బొబ్బిలిలో శంబంగి చేసే పనులు ఏమి లేవు...పైగా పార్టీ నేతలు కొందరు ఇసుక, ఇళ్ల స్థలాల్లో అక్రమాలు కూడా ఎక్కువే చేశారని ఆరోపణలు వస్తున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో శంబంగిపై వ్యతిరేకత పెరిగినట్లు కనిపిస్తోంది. ఇదే టి‌డి‌పికి ప్లస్ అవుతుంది...పైగా టి‌డి‌పి తరుపున సుజయ సోదరుడు బేబీ నాయన దూకుడుగా పనిచేస్తున్నారు. పార్టీని చాలా వరకు బలోపేతం చేశారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఈయనే టి‌డి‌పి తరుపున బొబ్బిలి బరిలో ఉంటారని తెలుస్తోంది. అలాగే రెండున్నర దశాబ్దాల తర్వాత బొబ్బిలిలో టి‌డి‌పి జెండా ఎగిరేలా చేస్తారని కూడా అర్ధమవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp