ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి...ఇటీవల అనేక రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి....వైసీపీకి చెక్ పెట్టడానికి టి‌డి‌పి-జనసేనలు కలవనున్నాయని ప్రచారం నడుస్తోంది. అటు వైసీపీ అనూహ్యంగా సి‌పి‌ఎంతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకుల నుంచి విశ్లేషణలు వస్తున్నాయి. అయితే ఊహించని విధంగా చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్‌లు రెండు చోట్ల పోటీ చేయనున్నారని కూడా కథనాలు వస్తున్నాయి.

అది కూడా ముగ్గురు నేతలు విశాఖ జిల్లాలో ఏదొక నియోజకవర్గంలో బరిలో దిగుతారని ప్రచారం నడుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లోనే రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయారు. భీమవరం, గాజువాకల్లో పోటీ చేసి ఓడిపోయారు. మరి ఈ సారి అవే స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే విశాఖలో గాజువాక కాకుండా భీమిలిలో కూడా పోటీ చేయొచ్చని ప్రచారం నడుస్తోంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజమవుతుందనేది పక్కనబెడితే....అనూహ్యంగా బాబు, జగన్‌లు రెండు సీట్లలో పోటీ చేస్తారని ప్రచారం మొదలైంది.

చంద్రబాబు...కుప్పంతో పాటు విశాఖ నగరంలో ఏదొక సీటు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కుప్పంలో ఎలాగో బాబుకు పట్టు తగ్గుతుంది...అదే సమయంలో విశాఖ నగరంలో టి‌డి‌పికి పట్టు ఉంది కాబట్టి, ఇక్కడ బరిలో ఉంటారని అంటున్నారు. అటు జగన్ సైతం రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారని ప్రచారం రావడం పెద్ద వింత.


జగన్ పులివెందులతో పాటు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానున్న విశాఖలో ఎదోక సీటులో పోటీ చేస్తారని కథనాలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ కథనాలుగానే మిగిలిపోతాయని తెలుస్తోంది. పవన్ పోటీ చేసే సీట్లు విషయంలో క్లారిటీ లేకపోయినా, చంద్రబాబు కుప్పంలో, జగన్ పులివెందులల్లోనే పోటీ చేస్తారని, ఇందులో ఎలాంటి డౌట్ లేదని తెలుస్తోంది. అసలు చంద్రబాబు, జగన్‌లు విశాఖలో పోటీ చేయడం జరగని పని టి‌డి‌పి, వైసీపీ శ్రేణులు అంటున్నాయి. కాబట్టి విశాఖ బరిలో బాబు..జగన్‌లు ఉండటం కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: