ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్(నాని)...పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. ముఖ్యంగా కొన్నేళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేత...అలాగే కాంగ్రెస్ తరుపున ఏలూరు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. అయితే వైఎస్సార్ చనిపోవడం, జగన్ వైసీపీ పెట్టడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేసిన జగన్ వెంటే నిలబడ్డారు.

అలా వైసీపీలోకి వెళ్ళిన ఆళ్ళ...2014 ఎన్నికల్లో ఏలూరు బరిలో నిలబడి ఓటమి పాలయ్యారు. మళ్ళీ 2019 ఎన్నికలోచ్చేసరికి ఆళ్ళ ఎమ్మెల్యేగా గెలిచారు...అయితే రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గాలిలో వైసీపీ నేతలకు భారీ మెజారిటీలు వచ్చాయి...కానీ ఏలూరులో ఆళ్ళకు వచ్చిన మెజారిటీ కేవలం 4 వేలే. ఇలా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ళకు...జగన్ మంత్రి పదవి కూడా ఇచ్చారు...అలాగే డిప్యూటీ సి‌ఎం పదవి సైతం ఇచ్చారు.

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఆళ్ళ తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు. అయితే మంత్రిగా ఆళ్ళ పనితీరు ఎలా ఉందో ప్రజలకే తెలియాలి. ఆయనకు అనుకున్న మేర మంత్రి పదవికి మంచి మార్కులు రాలేదనే చెప్పొచ్చు. అసలు కరోనా సమయంలో మన రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి ఎవరని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నించారంటే...పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఎమ్మెల్యేగా కూడా ఆళ్ళకు అనుకున్న మేర మార్కులు పడటం లేదని తెలిసింది. ఏలూరులో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు ఏమి జరగడం లేదని తెలుస్తోంది. ఈ పరిస్తిని బట్టి చూస్తే నెక్స్ట్ ఎన్నికల్లో నానికి మళ్ళీ ఛాన్స్ వచ్చేలా కనిపించడం లేదు. పైగా టి‌డి‌పి-జనసేనలు కలుస్తాయని అంటున్నారు. అలాంటప్పుడు నాని గెలుపుకు ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఏలూరులో జనసేనకు 16 వేల ఓట్లు పడ్డాయి...కానీ నానికి టి‌డి‌పి మీద వచ్చిన మెజారిటీ 4 వేలు..దీని బట్టి చూస్తే నానికి మళ్ళీ కష్టమే.  

మరింత సమాచారం తెలుసుకోండి: