రాజకీయాల్లో ఏ నాయకుడుకైనా అధికారమే మెయిన్ టార్గెట్...అధికారం లేనిదే నాయకులు ఉండలేరు. అధికారం కోసం నాయకులు పార్టీలు మారిపోతారు....మరికొందరు అధికారం వచ్చేవరకు యాక్టివ్ గా రాజకీయాలు చేయరు. అందుకే అనుకుంటా ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఎక్కువ మంది నాయకులు అడ్రెస్ లేకుండా పోయారు. గత ఎన్నికల్లో ఓడిపోయాక చాలామంది అడ్రెస్ లేరు...అయితే ఎన్నికలై రెండున్నర ఏళ్ళు కావడం, అధికార వైసీపీపై ఇప్పుడుప్పుడే కాస్త వ్యతిరేకత పెరుగుతుండటంతో టి‌డి‌పి నేతలు యాక్టివ్ అవుతున్నారు.

కానీ ఇంకొందరు నాయకులు ఇంకా అడ్రెస్ లేరు. అలా టి‌డి‌పిలో అడ్రెస్ లేని వారిలో సీనియర్ నేతలు సూర్యప్రకాశ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కే‌ఈ కృష్ణమూర్తిలు ఉన్నారు. ఇద్దరు ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేతలు..ఇద్దరు కర్నూలు జిల్లా రాజకీయాలని శాసించే వారు. ఒకప్పుడు ఇద్దరు ప్రత్యర్ధులుగా రాజకీయం చేశారు...కానీ ఇప్పుడు ఒకే పార్టీలో రాజకీయం చేస్తున్నారు. కే‌ఈ మొదట నుంచి టి‌డి‌పిలో పనిచేస్తున్నారు...కోట్ల గత ఎన్నికల ముందే టి‌డి‌పిలో చేరారు.

అయితే ఎన్నికలయ్యాక ఇద్దరు పార్టీలో కనిపించడం లేదు. గత ఎన్నికల్లో కోట్ల కర్నూలు ఎంపీగా, కోట్ల భార్య సుజాతమ్మ ఆలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక అప్పుడప్పుడు సుజాతమ్మ అయినా పార్టీలో కనిపించారు గానీ కోట్ల మాత్రం కనబడలేదు. మరి వచ్చే ఎన్నికల ముందు కనబడతారా? అప్పుడు మళ్ళీ టి‌డి‌పి తరుపున పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు.

ఇటు కే‌ఈ గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన తనయుడు శ్యామ్...పత్తికొండ బరిలో పోటీ చేశారు. అటు కే‌ఈ సోదరుడు ప్రతాప్...డోన్‌లో పోటీ చేశారు. ఇద్దరూ ఓడిపోయారు. ఓడిపోయాక అడ్రెస్ లేరు. అటు కే‌ఈ కూడా పార్టీలో కనిపించడం లేదు. మరి నెక్స్ట్ ఎన్నికల్లోనైనా పార్టీలో కనిపిస్తారా? లేక పార్టీనే మార్చేస్తారా అనేది తెలియడం లేదు. ఏదేమైనా కోట్ల, కే‌ఈ ఫ్యామిలీలు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరముంది. క్లారిటీ లేకుండా రాజకీయాలు చేస్తే తర్వాత ఇబ్బంది అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: