కరణం బలరాం....ఏపీ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నేత....టి‌డి‌పి అధినేత చంద్రబాబు సహచరుడు...చంద్రబాబుతో పాటే 1978లో రాజకీయ జీవితం మొదలుపెట్టిన నాయకుడు. అలాగే ఆ తర్వాత చంద్రబాబుతో పాటే కాంగ్రెస్ వీడి, టి‌డి‌పిలో చేరి కీలక నాయకుడుగా ఎదుగుతూ వచ్చారు. మధ్యలో కాస్త టి‌డి‌పికి దూరమైన...మళ్ళీ టి‌డి‌పిలోనే కంటిన్యూ అయ్యారు. 2019 ఎన్నికల వరకు కరణం టి‌డి‌పిలోనే కొనసాగారు.

ఆ ఎన్నికల్లో టి‌డి‌పి తరుపున చీరాల బరిలో నిలబడి మంచి మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే టి‌డి‌పి అధికారంలోకి రాకపోవడంతో కరణం మనసు కాస్త మారింది...అనూహ్యంగా తన తనయుడు వెంకటేష్‌కు వైసీపీ కండువా కప్పించి, తాను జగన్‌కు మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇలా కరణం వైసీపీ వైపుకు వెళ్ళడంతో టి‌డి‌పి శ్రేణులు షాక్ తిన్నాయి...అసలు టి‌డి‌పికి వీర విధేయుడు....చంద్రబాబుకు సన్నిహితుడైన కరణం పార్టీ మారతారని ఎవరూ అనుకోలేదు. కానీ అనూహ్యంగా కరణం పార్టీ మారిపోయారు.

సరే పార్టీ మారక అక్కడ కరణంకు అంత సుఖం ఏమి లేదు. ఏదో అధికారం పార్టీలో ఉన్నారు కాబట్టి వ్యాపారాలకు, రాజకీయంగా ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేవని తెలుస్తోంది. కానీ నెక్స్ట్ ఎన్నికల్లో కరణం రాజకీయం ఎలా ఉంటుందో క్లారిటీ లేదు. ఎందుకంటే అదే చీరాల సీటు కోసం మరో వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ కాచుకుని కూర్చున్నారు. ఇటు ఈ సీటు తనకే ఇస్తారని కరణంకు క్లారిటీ లేదు.


అటు తన తనయుడి రాజకీయ భవిష్యత్ ఏంటి అనేది క్లారిటీ లేదు. వెంకటేష్‌కు వైసీపీలో ఎలాంటి పొజిషన్ ఇస్తారో తెలియదు. ప్రస్తుతానికి ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. మరి నెక్స్ట్ ఎన్నికల్లో ఏదైనా సీటు ఇస్తారనే గ్యారెంటీ లేదు...ఇటు కరణం సీటుకే గ్యారెంటీ లేకుండా పోయింది. మరి ఇలాంటి పరిస్తితుల్లో కరణం...రాజకీయంగా ఎలాంటి స్టెప్ వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మళ్ళీ పరిస్తితి బట్టి కరణం పోలిటికల్ స్ట్రాటజీ మార్చి..టి‌డి‌పిలోకి వస్తారా? లేక వైసీపీలోనే కొనసాగుతారా? అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: