ప్రతి ఒక్కరూ తమదైన ప్రత్యేక గుర్తింపును పొందాలని కోరుకుంటారు. ఇక దీనిని సాధించడానికి చాలా మంది ఎన్నో రకాలుగా చాలా కష్టపడతారు. అయితే, వైఫల్యానికి గురైనప్పుడు, చాలా మంది తరచుగా వారి ధైర్యాన్ని కోల్పోతారు.ఇక ఈ రోజు మనము 12 వ తరగతి ఫెయిల్ అయిన IPS అధికారి మనోజ్ కుమార్ శర్మ గురించి మాట్లాడబోతున్నాము, కానీ అతను కూడా వైఫల్యాలు వచ్చినప్పుడు పట్టు వదల్లేదు. అందువల్ల దేశంలో క్లిష్ట పరీక్షలలో ఒకటి అయిన సివిల్స్ లో ఉత్తీర్ణత సాధించి ఎట్టకేలకు IPS అధికారి అయ్యాడు. ఇక అతని విజయ కథ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంకా ఇది ఖచ్చితంగా విద్యార్థులను ప్రేరేపిస్తుంది. మనోజ్ శర్మ మధ్యప్రదేశ్ లోని మొరెనా జిల్లాకు చెందినవారు. అతను చిన్నతనం నుండే IAS అధికారి కావాలనుకున్నాడు, కానీ దురదృష్టవశాత్తు, అతను 12 వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు, అంతే కాదు, అతను క్లాసులు 9 ఇంకా 10 లలో మూడవ డివిజన్ పొందాడు, 12 వ తరగతిలో, మనోజ్ హిందీ మినహా అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు.

అయితే, అనేక వైఫల్యాలు ఎదురైనప్పటికీ, మనోజ్ తనపై నమ్మకాన్ని కోల్పోలేదు. అతను తన లక్ష్యం నుండి వైదొలగలేదు ఇంకా దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక పరీక్ష - యుపిఎస్‌సికి కూడా సిద్ధమయ్యాడు. ఎన్నో ఫెయిల్యూర్స్ ని ఎదుర్కున్న మనోజ్ తర్వాత చాలా కష్టపడి UPSC పరీక్షకు హాజరై ఎట్టకేలకు విజయం సాధించడం అనేది జరిగింది. ఇక అలాగే అతను 2005 వ సంవత్సరంలో మహారాష్ట్ర కేడర్ నుండి IPS అవ్వడం అనేది జరిగింది. ఇక ప్రస్తుతం ముంబైలోని పశ్చిమ ప్రాంత అదనపు కమిషనర్‌గా మనోజ్ నియమితులయ్యారు.ఇక మనోజ్ చరిత్ర భావి తరాలకు గొప్ప ఆదర్శం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.కాబట్టి ఎవరైనా జీవితంలో తమ గోల్ ని సాధించడంలో విఫలమైతే ఖచ్చితంగా మనోజ్ ని ఆదర్శంగా తీసుకొని పట్టుదలతో ప్రయత్నించి మీ కలను నెరవేర్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

IPS