రాజ‌కీయాల్లో కేసీఆర్ పండిపోయాడ‌నే చెప్పాలి.. ఎందుకంటే రాష్ట్ర విభ‌జన త‌రువాత కేసీఆర్ ఎప్పుడూ కూడా టీఆర్ఎస్‌ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్ట‌లేదు. క్యాడ‌ర్‌ను అస‌లు ప‌ట్టించుకోలేద‌నే చెప్పాలి. కానీ ఇప్పుడు క‌థ మారింది. పార్టీ జిల్లా అధ్య‌క్షుల‌ను నియమించ‌డం.. పార్టీ ప్లీన‌రీ స‌మావేశం నిర్వ‌హించ‌డం వెనుక మ‌త‌ల‌బు ఏమిటి? ఇన్నాళ్లుగా కేసీఆర్ ఆ దిశగా ఎందుకు ప్ర‌య‌త్నించ‌లేదు అనే ప్ర‌శ్నలు వినిపిస్తున్నాయి. జిల్లాకు ఒక అధ్య‌క్షుడిని పెడితే ఆ జిల్లా పార్టీ మొత్తం సీఎం కేసీఆర్ చేతిలోనే ఉంటుంది. క్యాడ‌ర్‌పైనే పార్టీ నిల‌బ‌డితే నాయ‌కులు ఏమీ చేయ‌లేరు.


ఉదాహ‌ర‌ణ‌కు ఎన్‌టీఆర్ ను ప‌ద‌వి నుంచి తొలిగించాక క్యాడ‌ర్ ఎక్క‌డికీ వెళ్ల‌లేదు చంద్ర‌బాబు ద‌గ్గ‌రే ఉండిపోయింది. ఎందుకంటే అక్క‌డ అధికారం ఉంది కాబ‌ట్టి. సైన్యం ఉంటే నాయ‌కుడు ఎంత బ‌లంగా ఉంటాడు. అదే సైన్యం లేకుంటే నాయ‌కుడు ఎంత బ‌ల‌హీనంగా మారుతాడో చూడొచ్చు. అందుకే కేసీఆర్ ఏం చేశాడంటే సైన్యం ఇన్నాళ్లు లేకుండా చూసుకున్నాడు. కేవ‌లం త‌నే ఓ సైఓన‌న్యంగా భావించారు. ఎందుకంటే ఇది ఉద్య‌మ పార్టీ ఎవ‌రు తోక జాడించినా ఆయ‌న‌కు స‌మ‌స్య లేదు. అక్క‌డ క్యాడ‌ర్ లేదు కాబ‌ట్టి ప‌క్క పార్టీల్లోని నాయ‌కుల‌ను త‌మ పార్టీలో క‌లుపుకున్నాడు.


  ఇలా నాయ‌కులంతా ఏక చ‌త్రం కింద‌కు రాకుండా చూసుకున్నాడు. ఎక్క‌డిక‌క్క‌డ విడివిడివిగా ఎద‌గ‌నిచ్చాడు సీఎం కేసీఆర్‌. ఎప్పుడ‌యితే ఈట‌ల రాజేంద‌ర్ నాయ‌కుడిగా ఎదుకుతున్నాడ‌నుకున్న స‌మ‌యంలో ఆయ‌న్ను బ‌య‌ట‌కు గెంటేశారు. ఇన్నాళ్లు సీఎం కేసీఆర్‌కు తెలంగాణ సెంటిమెంటుతో ఓటు వేశారు. కానీ ఇప్పుడు ఆ ముచ్చ‌ట తీరిపోయింది. అందువ‌ల్ల ప్ర‌త్యామ్నాయం కోసం చూస్తున్నారు.


 దీంతో కేసీఆర్ త‌న అస్త్ర శ‌స్త్రాల‌ను సిద్దం చేసుకోక త‌ప్ప‌దు. కాంగ్రెస్‌, బీజేపీలో క్యాడ‌ర్ బ‌లంగా ఉంది. కాబ‌ట్టి ఆ పార్టీలోకి ఎంద‌రు నాయ‌కులు వ‌చ్చినా ప‌టిష్టంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు కేసీఆర్‌కు అన్ని దారులు మూసుకుపోతున్నాయి. దీంతో కేసీఆర్ పార్టీ క్యాడ‌ర్ బ‌లోపేతం పై దృష్టి పెట్టి జిల్లా అధ్య‌క్షుల‌ను నియ‌మించాడు. ఇప్పుడు క్యాడ‌ర్‌ను అంతా తీసుకువ‌చ్చి పెద్ద ప్లీన‌రీ స‌మావేశాన్నే పెడుతున్నాడు.  దీంతో నాయ‌కుడికి కార్య‌క‌ర్త‌కు ఉన్న గ్యాప్‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: