పార్టీ సంస్థాగత నిర్మాణం పై టిఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టింది. పార్టీ మూడు దశాబ్దాల ప్లీనరీని, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక  వ్యవహారాల గురించి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో  కార్యచరణపై ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ యొక్క సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, హాజరుకానున్నారు. పార్టీది ద్వి దశాబ్ది ఉత్సవాల పై టిఆర్ఎస్ లో తీవ్రంగా చర్చ కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఘనంగా ఏర్పాట్లు కూడా చేస్తోంది. దీనిపై చర్చ నిర్వహించేందుకు పార్టీ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే పార్టీ సంస్థాగత నిర్మాణం లో భాగంగా  సభ్యత్వాలను పూర్తి చేసుకొని గ్రామ మండల కమిటీలను నియమాకాలు కూడా చేపట్టింది.

 పార్టీ అనుబంధ సంఘాలతో కమిటీ లన్నిటి పూర్తిచేసింది. ఈనెల 25వ తేదీన హైటెక్స్ ప్రాంగణంలో 14వేల మంది ప్రతినిధులతో ప్లీనరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలు పెట్టింది. నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే పార్టీ అధ్యక్షుడు ఎన్నికకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 25వ తేదీ నాటికి అధ్యక్షుడి ఎన్నిక పూర్తి చేసుకొని, వీలుగా షెడ్యూలు కూడా విడుదల చేసింది. ఆదివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలు కానుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ తరఫున అధ్యక్షతన అధ్యక్ష పదవి కోసం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వేరువేరుగా  నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక లాంఛనమే  అప్పటికీ పార్టీ యొక్క నిబంధనల ప్రకారం ఎన్నిక పూర్తి చేయనుంది. ఈరోజు నుంచి 22వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ  కొనసాగనుంది.

ఈనెల 23వ తేదీన నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ ఉపసంహరణకు గడువు గా షెడ్యూల్ విడుదల అయింది. 25వ తేదీన జరిగే ప్లీనరీలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్నిక పూర్తి కానుంది. ప్లీనరీ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలు కార్యకర్తల సమీకరణపై తీసుకోవలసిన  జాగ్రత్తలు, నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: