తెలంగాణలో ఈనెల 30 వ తేదీన జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ ఎన్నిక ఒక ఎమ్మెల్యే ఉప ఎన్నిక మాత్రమే కాదు. ఓకె పార్టీలో ఉండి బయటకి వచ్చేసి తన సత్తా ఏమిటో అధికార పార్టీకి తెలియజేయాలని ఎదురుచూస్తున్న ఒక నాయకుడికి మరియు తెలంగాణ సీఎం కేసీఆర్ కి మధ్య జరుగుతున్న పరువు పోటీ అనొచ్చు. అయితే ఇక్కడ ప్రచారం సమయంలో మరియు నామినేషన్ సమయంలో ఉన్న పరిస్థితులు ఎన్నికల రోజున ఉంటాయి అనడానికి వీలు లేదు. అయితే ఎన్నికల రోజు వరకు ఎవరి ఎవరెవరికి ఓటు వేస్తారో పోటీ చేసే అభ్యర్థి ఊహించలేడు. తనతో ఉన్న వాళ్ళు తనకు జైకొట్టే వాళ్ళు ఓటు వేస్తారు అనే నమ్మకంతోనే ఉంటారు.

కానీ ఫలితం వచ్చే వరకు అసలు విషయం అర్థం కాదు. ఇదిలా ఉంటే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అటు బీజేపీ ఇటు తెరాస ల మదిలో సందేహాలు మొదలవుతున్నాయి. ఇప్పటి వరకు తెరాస చేపట్టిన పథకాలు గట్టెక్కిస్తాయా అని కేసీఆర్? మరియు ఈటల రాజేందర్ కు ఉన్న మంచి పేరు ఎన్నికల గెలుపులో ఎంత వరకు పలు అవుతుంది అని బేరీజు వేసుకుంటున్నారు. అయితే ఎన్ని పథకాలు చేపట్టినా ఎంత డబ్బు పోసినా ఓటర్లు  నిజాయితీ పరులకు మాత్రమే ఓటు వేస్తారు. తెరాస లో ఎక్కడో ఏదో సందేహం ఉండనే ఉంది. ప్రతి రోజూ అక్కడి పరిస్థితులను కేసీఆర్ తెలుసుకుంటూ ఉన్నారు. అయినా గెలుపుపై సరైన క్లారిటీ రావడం లేదు.

గతంలో దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలో ఇదే విధంగా నమ్మకంతో ఎలక్షన్ కు వెళ్లారు. రాష్ట్రం అంతా కూడా తెరాస గెలుస్తుందని భావించారు. కానీ అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ గెలుపొందారు. ఇది తెరాసకు పెద్ద షాక్ అయింది. అందుకే ఈ సారి తాము పథకాల పేరుతో మంచి చేసినా గెలుపు విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. మరి తెరాస గెలుస్తుందా లేదా రాజేందర్ నిజాయితీ గెలుస్తుందా అన్నది తెలియాలంటే ఇంకో ఇంకో మూడు వారాల పాటు ఆగక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: