దేశంలో పెట్రోలు ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. దీనితో ఆయా ప్రాంతాల నుండి వస్తువులను వినియోగదారులకు సరఫరా చేసేందుకు వాడే వాహన రవాణా కూడా ధరలు పెంచేసింది. దీనితో ఆయా వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. అంటే ఉన్న బడ్జెట్ లో నే సామాన్యులు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ ఖర్చులు నిర్వహణ చేసుకోవలసి వస్తుంది. అందువలన వచ్చే ఆదాయం కనీస అవసరాలకు కూడా సరిపోని స్థితిలో ఉంది. కరోనా సమయంలో ఆదాయం లేక, అనంతరం సరిగా పని లేక వచ్చేదే అంతంతమాత్రంగా ఉన్న సామాన్యుడు తనపై పెట్రో ధరల వలన పడే భారాన్ని భరించలేకపోతున్నాడు.

అయితే కేంద్రం కూడా దేశపరిస్థితులను బట్టి ఏమి చేయలేని స్థితిలో ఉంది. లాక్ డౌన్ సమయంలో కూడా ధరలు తగ్గించే అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ అప్పుడు కూడా పెట్రో మంట తప్పలేదు. దానివలన వచ్చే ఆదాయంతో కరోనా వలన పోగొట్టుకున్న ఆదాయాన్ని కాస్తైనా భర్తీ చేయాలన్నది కేంద్రం ఆలోచన కావచ్చు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు తమ బ్రతుకులలో ఎటువంటి ఆర్థికపరమైన మార్పులు లేకపోవటంతో సామాన్యుడి పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. ఉన్న ఊరిలోనే ఉంది ఏదో ఒకపని చేసుకుంటూ బ్రతకాలి అందువల్ల పరిస్థితి ఇంకా దినంగా ఉంది.

స్థానికంగా ఉన్న కొందరు ఆటో లాంటివి నడుపుకుంటూ రోజువారీ సంపాదన చేస్తూ బ్రతుకుబండి లాగుతుంటారు. వాళ్ళు పెట్రోల్ ధరలకు తగ్గట్టుగా ప్రయాణికుల దగ్గర డబ్బు ఎక్కువ వసూలు చేయలేరు. అలాగని ఉన్న రేట్లతో బండి నడపనూ లేరు. దీనితో ఎటు గాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇలాగె కొంతకాలం సాగితే ఆయా వాహనాలపై ఉన్న లోన్ కూడా తీర్చుకోలేని స్థితికి వాళ్ళ బ్రతుకులు చితికిపోనున్నాయి. మరి ఈ పెట్రో మంట వారి బ్రతుకులను అంతవరకూ తెస్తుందా లేక బ్రతకనిస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది. చూడబోతే పరిస్థితులు మాత్రం అందుకు అనుకూలంగా మాత్రం కనిపించడంలేదు. వీలైతే ఇంకాస్త పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి తప్ప ఇప్పట్లో తగ్గే అవకాశాలు కూడా లేవు. రాజకీయ పరంగా తీసుకున్నా కూడా ఇప్పుడే ఏ ఎన్నికలు లేవు. అలా అయినా కాస్త ధరలు తగ్గిస్తే, ఆ రోజులలో బ్రతుకుబండి నడిచినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: