పాకిస్తాన్ తాలిబన్ లను ప్రోత్సహించి ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించేందుకు సాయం కూడా చేసింది. అది సాధ్యం అవగానే తానే విజయం సాధించినంత ఉత్సాహంతో రంకెలు వేసింది. అలాగే చైనా తో స్నేహం మొదలైనప్పుడు కూడా భారత్ విరోధి తనతో చేతులు కలిపింది అని పొర్లిపొర్లి ఆనందం వ్యక్తం చేసింది. కానీ ఇప్పుడు ఆ రెండు ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారయ్యి క్షణం కూడా పాక్ కు ఊపిరి ఆడకుండా చేస్తుండటంతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. ఒక దేశాన్ని అన్యాయంగా ఆశ్రయించుకొని అక్కడి వాళ్ళపై దాష్టికాలు చేసిన వారికి అండగా ఉన్నందుకు పాక్ కి తగిన ప్రాయశ్చితం జరిగింది అంటున్నారు నిపుణులు. ఇక చైనా కూడా పాక్ ను ఏనాడూ తన స్నేహంగా చూడలేదు, ఎన్నడూ కాళ్లకింద చెప్పులాగానే ఊహించుకుంది, పైకి మాత్రం భారత్ ను ఎదిరిస్తున్న ఏకైన దేశానివి అంటూ పొగుడుతూ, మెల్లిగా ఉగ్రభూతాల ఊబిలోకి పూర్తిగా లాగేసింది.

ఐఎస్ సహా పలు తీవ్రవాద సంస్థలకు దేశంలో స్థానం కల్పించి, వారందరిని పెంచి పోషిస్తూ, 20 ఏళ్లుగా తాలిబన్ లను కూడా అక్కడే ఉంచి అమెరికా నుండి రక్షించింది పాక్. కానీ చివరికి వాళ్ళే కాబుల్ విమానాశ్రయం నిర్వహణలో నీ అజమాయిషీ అవసరం లేదు పొమ్మన్నారు. అనంతరం ఈ తీవ్రవాద సంస్థలన్నీ ఆఫ్ఘన్ లో ఉన్న మసీదులపైనే దాడులు చేసి పలువురిని హతమార్చడంపై పాక్ తీవ్రంగా అభ్యన్తరం వ్యక్తం చేస్తుంది. ఆఫ్ఘన్ లో ఉన్న షియాసున్నీలు మధ్య గొడవలు రాజుకునేందుకు ఈ దాడులు ప్రేరేపిస్తున్నాయి. ఇలా తానెంతో నమ్మిన వీరంతా తన అదుపులో లేకుండా పోతుండే సరికే పాక్ అసహనానికి గురి అవుతుంది. ఇప్పటికైనా స్నేహితులు ఎవరో, అసలు స్నేహాలు ఎవరితో చేయాలి అనేది పాక్ కు అర్ధం అయితే మంచిదే. అంత త్వరగా పాక్ మారుతుంది అనేది మాత్రం ఎవరికి నమ్మశక్యం కానీ పని.

ఇక చైనా కూడా పాక్ ను ఒక చేత్తో దగ్గరకు తీసుకోని మరో చేత్తో నిదానంగా విషం ఇస్తూ మొత్తానికి ప్రపంచం ముందు తీవ్రవాద ప్రేరేపిత దేశంగా నిలబెట్టింది. అందుకే ప్రపంచంలో ఎక్కడ అప్పు పుట్టకుండా పోయింది. అదే అసలు చైనా కి కూడా కావాల్సింది. ఇక చైనా కూడా ఓదార్చినట్టు ముందు వడ్డీ ఎంతో కూడా చెప్పకుండా అప్పులు ఇవ్వడం ప్రారంభించింది. అనంతరం నిండా ముంచింది. తాజాగా కరోనా సమయంలో  ఆగిపోయిన దాసు పవర్ ప్లాంట్ ను మళ్ళీ నిర్మించడానికి చైనా పాక్ ను పరిహారం అడిగింది. అది ఒకటో రెండో కాదు సరాసరి 38 బిలియన్ డాలర్ల మేర. అది విని పాక్ తెల్లబోయింది. నమ్మిన వాళ్ళు నట్టేట ముంచారని బాగా అర్ధం చేసుకుంది. ఇక నైనా తన బుద్ది మార్చుకుంటుందని ఆశిద్దాం..!

మరింత సమాచారం తెలుసుకోండి: