భారత శత్రుదేశాల దేశంపై వ్యూహాలు పన్నుతున్నాయి. వీలైతే దేశం కరోనా సమయంలో పోగొట్టుకోవాల్సిన ఆర్థికనష్టాన్ని ఇప్పుడు ఎలాగైనా సృష్టించాలని చూస్తున్నాయి. మొదటి నుండి భారత్ ను శత్రువుగానే చూస్తున్న పాక్ కు, భారత్ తనను ఎక్కడ మించిపోతుందేమో అనే అక్కసుతో ఉన్న చైనా తయారైంది. వీళ్ళతో ఉగ్రమూకలు మరోవైపు ఎప్పుడెప్పుడు భారత్ పై విరుచుకుపడదామా అని ఎదురు చూస్తున్నాయి. గత 50 ఏళ్లగా పాక్ అనేక తీవ్రవాద సంస్థలను పెంచిపోషిస్తున్న విషయం తెలిసిందే. దీనితో ఇప్పటికే అనేక మంది స్లీపర్ సెల్ ను ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటు చేసే ఉంటారు. అందులో పాక్ ప్రకారం భారత్ లో కూడా ఈ రకంగా అనేక మంది ని పెట్టి ఉంటుంది. ఇప్పుడు కరోనా తో కాస్త దెబ్బతిని ఉన్న భారత్ పై మరొక దెబ్బ కొడితే లేవలేక పడుతున్న దానిపై ఇష్టానికి అజమాయిషీ చేయవచ్చు అన్నది శత్రువుల వ్యూహం.

ఉన్న ప్రభుత్వం బలమైన జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు నడుపుతుండటంతో ఇప్పుడు వీళ్ళ ఆగడాలు పెద్దగా సాగటం లేదు, అందుకే దేశంలో ఉన్న సమస్యలను పెంచే విధంగా ఏదైనా చేసి, ప్రస్తుత ప్రభుత్వంపై అననుకూలత పెంచి గద్దె దించాలని చూస్తున్నాయి ఆ దేశాలు. అటుపిమ్మట భారత్ లో వచ్చే ఏ ప్రభుత్వమైనా తమ వ్యూహాలకు అనుకూలంగా మార్చుకోవచ్చు అనుకుంటున్నాయి. అసలే పాక్ పూర్తిగా సంక్షోభంలో మునిగిపోగా, ఇక చైనా కూడా దాదాపు అదే స్థితికి వచ్చిందనే చెప్పాలి. పాక్ పరిస్థితి అందరికి తెలుస్తున్నప్పటికీ, చైనా మాత్రం ఇంకా మేకపోతు గాంబిర్యాన్ని నటిస్తుంది. తనకు కావల్సిన వ్యవస్థలను సాధించుకోవడానికి సరిహద్దు దేశాలను బలిచేయడానికి సిద్ధం అవుతుంది.

అందులో భాగంగానే ఆఫ్ఘన్ ఆక్రమణ, అందులో వనరులు దండుకోవడానికి మాత్రమే అక్కడ అంత రక్తపాతం సృష్టించింది చైనా. ఇక తరువాత తైవాన్, అనంతరం భారత్ లోని అరుణాచలప్రదేశ్, లఢఖ్ లపై దాని కన్ను పడింది. ప్రస్తుతం ప్రభుత్వం ఉంటె అది సాధ్యం కాని పని అని దానికి అర్ధం కావడంతో, ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రాంతీయంగా ఉన్న ప్రతి సమస్యను పెద్దదిగా చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకే భారత్ కూడా స్వీయరక్షణ కోసం నిధులు సమకూర్చుకోవడానికే ఇంధన ధరలు తదితర పెంచుకుంటూనే పోతుంది. ఇక్కడ ఆదాయాన్ని ఆయుధాలు కొనుగోలు లేదా తయారీకి వాడుతుంది. ఇది భారతీయులు అర్ధం చేసుకోగలరా అనేది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: