భారత్ లో కరోనా కేసులు రెండు వందల పదిహేడు రోజుల తరువాత తగ్గాయి. మొదటి వేవ్ ధైర్యంగా ఎదుర్కొన్న భారత్ రెండో వేవ్ అంత త్వరగా వస్తుంది అనేది ఊహించలేకపోవడంతో కాస్త ఇబ్బంది పడిన మాట నిజమే కానీ, ఆందోళనపడి పరిస్థితిని తీవ్రతరం చేసుకోకుండా ఇంత పెద్ద వ్యవస్థను చక్కగా నిర్వహించి దాని నుండి కూడా ఇప్పుడిప్పుడే బయటపడింది భారత్. మొదట తడబడినా అనంతర పరిణామాలు చుస్తే, రెండో వేవ్ ను కూడా భారత్ ధైర్యంగానే, చాకచక్యంతో ఎదుర్కొన్నదనే చెప్పాలి. తాజా పరిస్థితి చూస్తే రెండో వేవ్ బాగా ఉదృతంగా ఉన్న సమయంలోనే వాక్సిన్ ఒక్కటే పరిష్కారం అని ఆలోచించి, అప్పటి నుండి భారత్ భారీగా ఉత్పత్తి పెంచి దానిని పౌరులకు నియమబద్ధంగా ఇస్తూ వచ్చింది. దీనితో ఇప్పటివరకు దాదాపుగా 100 కోట్లు డోసులు పంపిణి చేసింది. వంద కోట్ల స్థితిని విజయంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేస్తుంది భారత ప్రభుత్వం.

ఇదిలా ఉంటె తాజాగా పండుగ రోజున కూడా పరీక్షలు చేయించుకున్న వారు అనేక మంది ఉన్నప్పటికీ, గతంతో పోలిస్తే ఈ సంఖ్య బాగా  తగ్గింది. అంటే భారత్ లో కేసులు బాగా తగ్గడమే ఇందుకు కారణం. అంటే ఈ పండుగ సీజన్ లో కేవలం 9 లక్షలు మంది మాత్రమే పరీక్షలు చేయించుకోవడం జరిగింది. అందులో దాదాపు 15వేల మందికి మాత్రమే పాజిటివ్ గా తేలింది. ముందు రోజుతో పొలిస్తేనే కేసులలో 5.7 శాతం తగ్గుదల కనిపించింది. 17వేల చిల్లర కోలుకున్నారు. 166 మంది ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది ప్రారంభం నుండి 340000000 మంది వైరస్ బారిన పడితే, 33300000 మంది కోలుకోగా, రికవరీ రేటు 98.08 శాతంగా ఉంది. మొత్తం 4లక్షల చిల్లర ఇప్పటి వరకు వైరస్ కు బలైపోయారు. సెలువు రోజు కావడంతో పరీక్షలు కూడా తగ్గాయి. అలాగే టీకాలు కూడా 8 లక్షల చిల్లర వారు టీకాలు వేయించుకున్నారు. ఇప్పటి వరకు కేంద్రం పంపిణి చేసిన టీకాల సంఖ్య 97కోట్లపైమాటే.

అయితే ఇప్పటి వరకు తగ్గుతుందని కొందరు మళ్ళీ కరోనా జాగర్తలు పాటించ కుండానే పండుగల కు ప్రయాణాలు చేశారు. ఈ నేపథ్యంలో మరో పది పదిహేను రోజులలో కేసులు పెరగక పోతే భారత్ బ్రతికినట్టే, లేదు మళ్ళీ కేసులు పెరిగితే పరిస్థితి మొదటికి వచ్చే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఇంకా రెండో వేవ్ ఉంది, మూడో వేవ్ సిద్ధంగా ఉంది అని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తూనే ఉంది. కానీ ఎవరు కూడా కరోనా నియమాలు పాటించడం లేదు. ముందస్తు జాగర్తలు కాపాడగలవు అనేది ప్రజలు కూడా తెలుసుకొని, మరో రెండు లేదా మూడు నెలలు కనీసంలో కనీసం కరోనా నియమాలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: