హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ల్లో హోరా హోరీ పో టీ నడుస్తోంది. ముఖ్యం గా అధి కారం టిఆ ర్ఎస్ పార్టీ మరియు భార తీయ జనతా పార్టీ ల మధ్యే ప్రధా న పో టీ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే అధికార టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలను మరియు సీఎం కేసీఆర్ పేరును వాడి ప్రచారం చేస్తోంది. అలాగే మంత్రి హరీష్ రావు స్వయంగా రంగంలోకి దిగి... ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అటు మాజీ మంత్రి ఈటల రాజేందర్.. బిజెపి పార్టీ తో కాకుండా సొంత అనుచరులతో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. 

ఎలాగైనా హుజరాబాద్ నియోజకవర్గం లో గెలవాలనే నేపథ్యంలో.... ఈటల రాజేందర్ వ్యూహరచన చేస్తున్నారు. అయితే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ.. అటు టిఆర్ఎస్ పార్టీలో ఇటు భారతీయ జనతా పార్టీలో టెన్షన్ నెలకొంది.  ఈసారి ఎన్నికల్లో కూడా కార్ గుర్తు తరహాలోనే రోడ్డు రోలర్ గుర్తులు ఉన్నాయి. దీంతో దుబ్బాక తరహాలో తమ ఓట్లు చీలే అవకాశం ఉందని అధికార టీఆర్ఎస్ పార్టీ భయపడుతోంది. ఇక... భారతీయ జనతా పార్టీకి ఎన్నడూ లేని కొత్త సమస్య వచ్చి పడింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ గత 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశారు.

అంతేకాక కారు గుర్తు పైనే ఆయన సుమారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గం లో... చాలా మంది... ముఖ్యంగా వృద్ధులు.. ఈటల రాజేందర్ కారు గుర్తుకే ఓటు వేస్తామని అంటున్నారట. ఆయన బిజెపి పార్టీలోకి వెళ్లిన సంగతి... చాలామందికి తెలియదట.  ఈటెల రాజేందర్ కార్ గుర్తు పై నిలుచున్నారు అని అందరూ భావిస్తున్నారట. దీంతో ఈటెల రాజేందర్ శిబిరంలో కొంత టెన్షన్ మొదలైంది. ఒకవేళ నిజంగానే... ప్రజలు కన్ఫ్యూజ్ అయితే ఈటల రాజేందర్ కు షాక్ తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: