గుడివాడలో టి‌డి‌పి నాయకులు పెద్దగా యాక్టివ్‌గా లేరనే చెప్పొచ్చు....గత రెండు ఎన్నికల్లో పార్టీ వరుసగా ఓడిపోవడం, ఇప్పుడు వైసీపీ అధికారంలో కొనసాగడం, కొడాలి నాని మంత్రిగా ఉండటంతో టి‌డి‌పి శ్రేణులు బాగా సైలెంట్ అయ్యాయి. పైగా కొందరు టి‌డి‌పి కార్యకర్తలు వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో గుడివాడలో టి‌డి‌పి వీక్ అవుతూ వస్తుంది. అయితే పార్టీ వీక్ అవుతున్న సరే టి‌డి‌పి అధిష్టానం గానీ, పార్టీ ఇంచార్జ్‌ రావి వెంకటేశ్వరరావు గానీ పట్టించుకునే పరిస్తితి లేదు.

అందుకే ఎప్పుడూలేని విధంగా గుడివాడ నియోజకవర్గంలో ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అంటే టి‌డి‌పి పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు...అలాగే టి‌డి‌పి నాయకత్వం ఎంత వీక్‌గా ఉందో అర్ధమవుతుంది. ఎక్కడైనా నాయకుడు ముందు ఉంటే....వెనుక కార్యకర్తలు నడుస్తారు. కానీ ఇక్కడ నాయకుడు ముందుండి నడిపించడం లేదు. ఎన్నికలై రెండున్నర ఏళ్లు అయిపోయినా సరే రావి వెంకటేశ్వరరావు బయటకొచ్చి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయడం లేదు.

అయితే రావి బయటకు రాకపోవడానికి కారణాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. ఇప్పటినుంచే బయటకొచ్చి దూకుడుగా ఉండటం వల్ల ఇబ్బందులూ ఉన్నాయి....అసలే వైసీపీ అధికారంలో ఉంది....నాని మంత్రిగా ఉన్నారు దీంతో రాజకీయంగా ఇబ్బందికర పరిస్తితులు రావొచ్చు. అలాగే అధికారంలో లేరు కాబట్టి కార్యకర్తలని మెయిన్‌టైన్ చేసుకుంటూ రావాలంటే ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది.

అందుకే రావి అంతగా దూకుడుగా ఉండటం లేదని తెలుస్తోంది. అసలు అన్నిటికంటే రావి భయం వచ్చి...సీటు వస్తుందా? రాదా? అనేది. ఇప్పటికే రెండుసార్లు హ్యాండ్ ఇచ్చారు. అసలు గుడివాడ రావి సిట్టింగ్ సీటు అయితే 2004 కావాలని కొడాలికి సీటు ఇచ్చారు. అక్కడ నుంచి రావి సైడ్ అయ్యారు. మళ్ళీ కొడాలి వైసీపీలోకి వెళ్ళడంతో 2014లో తీసుకొచ్చి సీటు ఇచ్చారు. అయినా రావి గెలవలేదు.

మళ్ళీ 2019 ఎన్నికల్లో రావిని సైడ్ చేసి...విజయవాడ నుంచి దేవినేని అవినాష్‌ని తీసుకొచ్చి నిలబెట్టారు. ఇక అవినాష్ ఓడిపోయాక వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో మళ్ళీ రావికి బాధ్యతలు అప్పగించారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ హ్యాండ్ ఇవ్వొచ్చనే భయంతోనే రావి టి‌డి‌పిలో అంతగా యాక్టివ్ గా ఉండటం లేదని తెలుస్తోంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: