ఆంధ్రావ‌ని ప్ర‌జ‌ల‌కు ముఖ్యంగా శ్రీ‌కాకుళం ప్ర‌జ‌ల‌కు ఊర‌ట‌నిచ్చేలా విద్యుత్ శాఖ అధికారులు చ‌ర్య‌లు చేప‌డుతూ అహ‌ర్నిశ‌లూ శ్ర‌మిస్తున్నారు. మ‌రోవైపు ఆగిపోయిన విద్యుత్ ప్లాంట్ల ప‌నితీరును పున‌రుద్ధ‌రించేందుకు జ‌గ‌న్ చొర‌వ చూపుతున్నారు. ఇందుకు త‌గ్గ ప్ర‌య‌త్నాలేవో చేస్తున్నారు. కృష్ణ ప‌ట్నం కానీ వీటీపీఎస్ కానీ ఇంకా ఇంకొన్ని త‌మ ప‌ని మొద‌లుపెడితే విద్యుత్ కొర‌త నుంచి కొంత కొలుకోవ‌చ్చు అన్న‌ది స్ప‌ష్ట‌మ‌యిన స‌మాచారం. అదేవిధంగా బ‌హిరంగ మార్కెట్లో విద్యుత్ (ఒక్కో యూనిట్ కు) ధ‌ర కూడా బాగా త‌గ్గింది. శుక్ర‌వారం ఇర‌వై రూపాయ‌ల నుంచి ఆరు రూపాయ‌ల 11 పైస‌ల‌కు ప‌డిపోయింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఈ పరిణామం ఎంతో ఊర‌ట‌నిచ్చింది. సో.. బీ హ్యాపీ మై డియ‌ర్ ఫ్రెండ్స్ ... కానీ ఇదే స‌మ‌యంలో పొదుపు మాట మాత్రం మ‌రువొద్దు.



విద్యుత్ సంక్షోభం నివార‌ణ‌కు ఏపీ స‌ర్కారు ముందుకు వ‌చ్చింది. బొగ్గు ఆధారిత ప్లాంట్లు నిలిచిపోవ‌డంతో సంబంధింత యూనిట్లు తిరిగి ప‌నిచేసేందుకు, అందుకు త‌గ్గ బొగ్గు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధం అవుతోంది. ఇందుకు నిధులు కూడా కేటాయించార‌ని సంబంధిత ఇంధ‌న శాఖ అధికారులు చెబుతున్నారు. బొగ్గు కొనుగోళ్ల‌కు సంబంధించి నిధుల లోటు లేనే లేద‌ని, ఇందుకు రెండు వంద‌ల యాభై కోట్ల రూపాయ‌లు కేటాయించార‌న్న‌ది మ‌రో స‌మాచారం. అదేవిధంగా కేంద్రం కూడా స‌హకారం అందిస్తోంద‌ని తెలుస్తోంది. సో...ఇప్ప‌టికిప్పుడు కొంప‌లు మునిగిపోయేలా విద్యుత్ సంక్షోభం రాద‌ని తేలిపోయింది. మ‌రెందుకీ హ‌డావుడి?



విద్యుత్ కోత‌ల‌కు సంబంధించి ఏపీ స‌ర్కారు త‌ర‌ఫున ఓ వాద‌న వినిపిస్తోంది. కోత‌ల్లేవు అని, అదేవిధంగా పొదుపుగా విద్యుత్ వా డాలని, సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్న ఏ వార్త‌నూ న‌మ్మొద్ద‌ని చెబుతున్నారు శ్రీ‌కాకుళం జిల్లా విద్యుత్ శాఖ అధికా రులు. ఈ విష‌య‌మై ఓ స్ప‌ష్ట‌త ఇస్తున్నారు కూడా! లోడ్ రిలీఫ్ పేరిట విద్యుత్ కోత‌లు ఉంటాయ‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని కొట్టిపారేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో విద్యుత్ పొదుపుపై అంతా అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని కూడా చెబుతున్నారు. ఒక యూని ట్ విద్యుత్ పొదుపు చేస్తే రెండు యూనిట్ల విద్యుత్ ను ఉత్ప‌త్తి చేసిన వారు అవుతార‌ని కూడా చెబుతున్నారు. బొగ్గు కొర‌త ఉన్న ప్ప టికీ కోత‌లు ఉండ‌వ‌ని, అందుకు త‌గ్గ ప్ర‌త్యామ్నాయ మార్గాలు అన్వేషించామ‌ని, స‌ర‌ఫ‌రాలో నిలుపుద‌ల కానీ అన‌ధికార కోత లు కానీ ఉండ‌వ‌ని మ‌రో మారు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp