తెలంగాణ రాజ‌కీయాలు ఎప్పుడు ఎటు వైపు ట‌ర్న్ తీసుకుంటాయో ?  కూడా తెలియ‌డం లేదు. రేవంత్ రెడ్డికి పీసీసీ ప‌ద‌వి ఇవ్వ‌క ముందు వ‌ర‌కు అక్క‌డ అధికార టీఆర్ ఎస్ వ‌ర్సెస్ బీజేపీ అన్న‌ట్టుగా రాజ‌కీయం న‌డిచింది. ఇక ఇప్పుడు రేవంత్ కు పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి రావ‌డంతో పాటు ఆయ‌న యాక్టివ్ అవ్వ‌డంతో అక్క‌డ రాజ‌కీయం టీఆర్ ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ అన్న‌ట్టుగా మారుతోంది. ఈ క్ర‌మంలోనే బీజేపీ ఇప్పుడు మ‌రింత యాక్టివ్ అవుతోంది. ప‌లువురు కీల‌క నేత‌ల‌పై వ‌ల వేసి ఏదోలా త‌మ పార్టీలో చేర్చుకునే ప్ర‌య‌త్నాలు స్టార్ట్ చేసింది.

ముఖ్యంగా అధికార టీఆర్ ఎస్ పార్టీ లో అసంతృప్త నేత‌లుగా ఉన్న వారిపై ఆ పార్టీ వ‌ల వేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు చెందిన టీఆర్ ఎస్ కీల‌క నేత‌, మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావును ఇప్పుడు బీజేపీ త‌మ పార్టీలో చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసిన‌ట్టు స‌మాచారం. బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తుమ్మ‌ల‌కు స్వ‌యంగా ఫోన్ చేసి పార్టీలోకి ఆహ్వానించారట‌.

పార్టీలో చేరితే తుమ్మ‌ల‌కు జాతీయ స్థాయి పార్టీ ప‌ద‌వితో పాటు రాజ్య‌స‌భ సీటు ఇస్తామ‌ని చెప్పిన‌ట్టు కూడా తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోది. క‌మ్మ సామాజిక వ‌ర్గం కొద్ది రోజులుగా తెలంగాణ లో త‌మ‌కు రాజ‌కీయంగా స‌రైన ప్రాధాన్య‌త లేద‌ని తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ క్ర‌మంలో నే ఆ సామాజిక వ‌ర్గంలో బ‌ల మైన నేత‌గా ఉన్న తుమ్మ‌ల‌ను పార్టీలోకి లాగేసుకుంటే గులాబీ పార్టీకి పెద్ద షాకే అవుతుంద‌ని బీజేపీ లెక్క‌లు వేస్తోంది.

ఇక తుమ్మ‌ల కూడా గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి రాజ‌కీయంగా ప్రాధాన్య త లేకుండా ఉండి పోయారు. మ‌రి ఆయ‌న బీజేపీ ఆఫ‌ర్ కు ఓకే చెప్తారా ?  లేదా గులాబీ గూట్లోనే ఉంటారా ? అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: