జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి రెండున్న రేళ్లు పూర్తి అవుతోంది. అంటే జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో స‌గం పాల‌న పూర్త‌య్యింది. ఇక జ‌గ‌న్ కు మిగిలింది కేవ‌లం యేడాదిన్న‌ర మాత్ర‌మే . చివ‌రి యేడాది అంతా ఎన్నిక‌ల టైం గానే ఉంటుంది. ఇక జ‌గ‌న్ ముందు నుంచి చెపుతున్న‌ట్టుగా నే రెండున్న‌రే ళ్ల త‌ర్వాత త‌న కేబినెట్ ను ప్ర‌క్షాళ‌న చేస్తాన‌ని చెప్పారు. దీంతో ఇప్పుడు త‌న కేబినెట్లో ఉన్న మంత్రుల‌లో చాలా మంది మంత్రులు అవుట్ కానున్నారు. మ‌రో వైపు జ‌గ‌న్ ఈక్వేష‌న్లు మారితే నూటికి నూరు శాతం కొత్త మంత్రులు వ‌చ్చినా ఆశ్చ‌ర్య పోన‌క్క‌ర్లేద‌ని వైసీపీ వ‌ర్గాల్లోనే ప్ర‌చారం న‌డుస్తోంది.

ఇదిలా ఉంటే జ‌గ‌న్ త‌న కేబినెట్లో ఉన్న మంత్రుల‌పై నిఘా పెట్టి న‌ట్టు కూడా పార్టీ వ‌ర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. జ‌గ‌న్ కృష్ణా జిల్లా మంత్రి, సిక్కోలు మంత్రి తో పాటు ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కే చెందిన‌ మ‌రో మంత్రిపై నిఘా పెట్టిన‌ట్టు టాక్ ?  కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఫైర్ బ్రాండ్ మంత్రి జ‌గ‌న్ త‌ర‌పున బల‌మైన వాయిస్ వినిపిస్తూ చంద్ర‌బాబు , టీడీపీని ఎప్ప‌టి క‌ప్పుడు ఫుట్‌బాల్ ఆడుతూ ఉంటారు. అయితే గ‌త కొద్ది రోజులుగా ఆయ‌న వ్య‌వ‌హారం ఏదో తేడా కొడుతుంద‌న్న సందేహాలు పార్టీలో వ‌స్తున్నాయ‌ట‌.

ఎందుకంటే ఆయ‌న సామాజిక వ‌ర్గానికే చెందిన మ‌రో సీనియ‌ర్ నేత‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని జ‌గ‌న్ చెప్పారు. ఈ క్ర‌మంలోనే త‌న‌ను ఎక్క‌డ కేబినెట్ నుంచి త‌ప్పిస్తారో ? అని ఆయ‌న అస‌మ్మ‌తి రాగాలు స్టార్ట్ చేసే ప‌నిలో ఉన్నార‌ట‌. అందుకే జ‌గ‌న్ స‌ద‌రు మంత్రిపై నిఘా పెట్టార‌ని అంటున్నారు. ఇక సిక్కోలు కు చెందిన మ‌రో మంత్రి పై జ‌గ‌న్ ఎంతో న‌మ్మ‌కం ఉంచినా మంత్రి ప‌ద‌వి తీసేస్తార‌ని తెలియ‌డంతో ఆయ‌న కూడా పార్టీ ని స‌ర్వ‌నాశ‌నం చేసేందుకు కంక‌ణం క‌ట్టుకున్నార‌ట‌.

అందుకే జ‌గ‌న్ ఆయ‌న వ్య‌వ‌హారంపై సొంత పార్టీ నేత‌ల‌తోనే నిఘా పెట్టించార‌ని అంటున్నారు. ఇక ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కే చెందిన మ‌రో మంత్రి త‌న‌ను తాను సీఎంగా చెప్పుకుంటున్నార‌ట‌. అందుకే ఆయ‌న పై కూడా నిఘా ఎక్కువుగా ఉంద‌ని టాక్ ?

మరింత సమాచారం తెలుసుకోండి: