సంఖ్యా ప‌రంగా త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ.. టీడీపీ ఎమ్మెల్యేలు దూకుడుగా ఉన్నారు. ఈ ప‌రిణామం.. అధికార పార్టీ వైసీపీని తీవ్ర ఇర‌కాటంలోకి నెడుతోంది. కొన్ని జిల్లాల్లో అయితే.. టీడీపీ నేత‌ల వాయిస్ వినిపిస్తున్న విధంగా వైసీపీ నేత‌ల వాయిస్ వినిపించ‌డం లేదు. దీంతో టీడీపీ గ్రాఫ్ ఆయా జిల్లాల్లో జోరుగా కొన‌సాగుతోం ది. ప్ర‌కాశం, గుంటూరు, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలో ఎక్కువ‌గా టీడీపీ నేత‌లు దూకుడుగా ఉన్నారు. ప్ర‌కాశం జిల్లాను తీసుకుంటే.. ఉన్న‌ది ముగ్గురు ఎమ్మెల్యేలే అయినా.. టీడీపీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపిస్తున్నారు.

జిల్లా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌ధానంగా ప్ర‌స్తావిస్తూ.. అటు తెలంగా; ఇటు ఏపీ ప్ర‌భుత్వాల‌ను నిల‌దీస్తున్నారు. గొట్టిపాటి ర‌వికుమార్‌, డోలా బాల వీరాంజ‌నేయ‌స్వామి, ఏలూరి సాంబ‌శివ‌రావుల దూకుడుతో జిల్లా పొలిటిక‌ల్ ముఖ‌చిత్రంలో టీడీపీ గ‌గ్రాఫ్ జోరుగా పుంజుకుంది. ఇక‌, గుంటూరు విష‌యానికి వ‌స్తే.. మాజీ మంత్రి ఆల‌పాటి రాజా, ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ వంటివారు.. దూకుడుగా ఉన్నారు. ఇక‌, రాజ‌ధాని గ్రామాల్లోనూ టీడీపీ నేత‌ల దూకుడు బాగానే ఉంది. బాప‌ట్ల‌లో వేగేశ్న న‌రేంద్ర వ‌ర్మ‌.. పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తు.. టీడీపీ పున‌రుత్తేజం దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

శ్రీకాకుళంలో పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహ‌న్‌ల‌కు దీటుగా.. మాజీ విప్ కూన ర‌వికుమార్‌, గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన గౌతు శిరీష‌.. స‌హా చాలా మంది నేతలు.. మంచి వాయిస్ వినిపిస్తున్నారు. ఇక‌, వ‌యో వృద్ధురాలు అయిన‌ప్ప‌టికీ.. గుండ ల‌క్ష్మీదేవి నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు. కృష్నాజిల్లాను తీసుకుంటే.. మాజీ మంత్రులు.. దేవినేని ఉమా, కొల్లు ర‌వీంద్ర‌, బొండా ఉమా.. వంటివారు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌భుత్వంపై ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు.

అదేవిధంగా అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి, వ‌ర్ల రామ‌య్య వంటివారు నిత్యం స‌మ‌స్య‌ల‌పై మీడియా ముందుకు వ‌స్తూ.. ప్ర‌జ‌ల‌ను క‌దిలిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో వైసీపీ నాయ‌కుల ఊసు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. వీరికి కౌంట‌ర్లు ఇచ్చే నాయ‌కులు కూడా క‌నిపించ‌డం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వారు.. టీడీపీ గ్రాఫ్ ఆయా జిల్లాల్లో జోరుగా ఉంద‌ని.. వైసీపీ నేత‌లు పుంజుకోవ‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: