గ‌త కొద్ది రోజు ల నుంచి దేశ వ్యాప్తంగా పెట్రోల్, డిజిల్ , గ్యాస్ ల పై ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుత‌న్నాయి. ప్ర‌తి రోజూ వీటి పై ధ‌ర‌లు పెంచుతూ నే ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దాదాపే రూ. 15 వ‌ర‌కు పెంచేశారు. అయితే వీటి ధ‌ర‌లు వీపరీతం గా పెర‌గ‌డానికి కార‌ణాల‌ను మాత్రం కేంద్రం రాష్ట్ర ప్ర‌భుత్వాల పై రాష్ట్ర ప్ర‌భుత్వాలు కేంద్ర ప్ర‌భుత్వం వైపు చెబుతూ కాలం వెల్ల దీస్తున్నారు. పండుగ పూట కూడా రెస్ట్ లేకుండా పెట్రో డిజిల్ ల పై ధ‌ర‌లు పెరుగుతూ నే ఉన్నాయి. ఈ రోజు కూడా ఈ వ‌డ్డన ఆగ‌లేదు. ఈ మ‌న తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ లో పెట్రోల్ పై రూ. 36 పైస‌ల్ అలాగే డిజిల్ పై రూ. 38 పైస‌ల్ పెరిగాయి. దీంతో ప్ర‌స్తుతం హైద‌రాబాద్ న‌గ‌రంలో పెట్రోల్ ధ‌ర ఏకంగా రూ. 110 దాటేసింది. ప్ర‌స్తుతం రూ. 110.09 వ‌ద్ద హైద‌రాబాద్ న‌గ‌రం లో పెట్రోల్ ల‌భిస్తుంది. అలాగే డిజిల్ ధ‌ర‌లు హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇప్ప‌టికే రూ. 100 కొండ ఎక్కేసింది. ప్ర‌స్తుతం రూ. 103.18 వద్ద డిజిల్ ధ‌ర ఉంది.




అయితే ఇలా పెట్రోల్ డిజిల్ ధ‌ర‌లు విప‌రీతం గా పెరుగుతూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏమాత్రం స్పందించ కుండా నిమ్మ‌కు నీరేత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. అంతే కాకుండా ఒక‌రి పై ఒకరు విమ‌ర్శ లు చేసుకుంటు ప్ర‌జ‌ల ను త‌ప్పు దారి ప‌ట్టి స్తున్నారు. కేంద్ర లో మోడీ ప్ర‌భుత్వం రాక  ముందు లీట‌ర్ పెట్రోల్ పై కేంద్ర ప‌న్ను రూ. 9.20 గా ఉండేది. 2014 తర్వాత మోడీ అధికారంలో కి వ‌చ్చిన త‌ర్వ‌త పెట్రోల్ డిజిల్ గ్యాస్ ధ‌ర‌లకు రెక్క‌లు వ‌చ్చాయి. దీని కార‌ణం ప్ర‌తి లీట‌ర్ పెట్రోల్ పై కేంద్ర విధించే పన్నును విప‌రీతంగా పెంచ‌డ‌మే అని చెప్పాలి. ప్ర‌స్తుతం ఒక లీట‌ర్ పెట్రోల్ పై కేంద్ర విధించే ప‌న్ను అక్ష‌రాల రూ.32.90 కి పెంచేసింది. మోడీ ప్ర‌భుత్వం వ‌చ్చిన నాటి నుంచి అంటే గ‌త  ఏడేళ్ల‌లో కేంద్రం ప‌న్ను ఒక లీట‌ర్ పై దాదాపు 258 శాతం పెంచేసింది. దీని వ‌ల్ల‌నే పెట్రోల్ డిజిల్ ధ‌ర‌లు కొండేక్కి పోతున్నాయ‌ని ఆర్థిక విశ్లేష‌కులు అంటున్నారు. అయితే ప‌న్నులు విధించ‌డం లో రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా త‌క్కువేమీ కాదు. రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా స్టేట్ వ్యాట్ తో పెట్రోల్ డిజిల్ పై బాగానే వ‌డ్డిస్తున్నారు. చివ‌ర‌గా కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు రెండు కూడా ప‌న్ను ల పేరు తో పెట్రోల్ డిజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల కు కార‌ణం అవుతున్నాయి.





మరింత సమాచారం తెలుసుకోండి: