గులాబ్ తుఫాను ఉత్త‌రాంధ్ర వాసుల‌ను భ‌య‌కంపితుల‌ను చేసింది. అంత‌టి స్థాయిలో కాకున్నా వాన భ‌యం మాత్రం మా ప్రాంత వాసుల‌ను వెన్నాడుతూనే ఉంది. ద‌స‌రా కార‌ణంగా బంగాళాఖాతంలో ఏర్ప‌డ్డ అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో శ్రీ‌కాకుళంతో పాటు ప‌లు ప్రాంతాల‌లో కురిసిన వాన‌లు జ‌న‌జీవ‌నాన్ని కాస్త ఇబ్బంది పెట్టాయి. కొన్ని చోట్ల ద‌స‌రా సంబ‌రాల‌న్న‌వి లేనే లేకుండా చేశాయి. కొన్ని చోట్ల అమ్మవారి ద‌ర్శ‌నాల‌కు వ‌చ్చిన భ‌క్తులు చాలా అవ‌స్థ‌లు ప‌డ్డారు. శ్రీ‌కాకుళంతో స‌హా ప‌లు ప్రాంతాల‌లో కురిసిన వాన‌ల కు కొన్నింట రోడ్లు దెబ్బ‌తిన్నాయి. ఇంకొన్ని చోట్ల పంట న‌ష్టం కూడా వాటిల్లింద‌ని తెలుస్తోంది. తిరుప‌తిలో ప‌లు కాల‌నీలు నీట మునిగి ఉన్నాయి.



రెండ్రోజులుగా కురిసిన వాన‌లు ఉత్త‌రాంధ్ర‌ను భ‌య‌కంపితం చేశాయి. వానల కార‌ణంగా పంట‌ల‌పై ప్ర‌భావం ఎలా ఉంటుందో అన్న ఆందోళ‌న‌ను రైతులు వ్య‌క్తం చేశారు. ద‌స‌రా రోజున ప్రారంభం అయిన వాన‌, శ‌నివారం కూడా కొన‌సాగింది. అటుపై ఆదివారం వాతా వ‌ర‌ణం మాత్రం మేఘావృత‌మై ఉంది. వాన‌ల కార‌ణంగా వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డిన‌ప్ప‌టికీ పండుగ సంతోషాలు మాత్రం అస్స‌లు లే కుండా పోయాయి.  ఎవ్వ‌రినీ బ‌య‌ట‌కు రానివ్వ‌లేదు. మార్కెట్లు కూడా పెద్ద‌గా  న‌డిచింది లేదు. వాన కార‌ణంగా కొన్ని చోట్ల రోడ్లు జ‌ల‌మ‌యం అయ్యాయి.

ముఖ్యంగా ఇటీవ‌లే గులాబ్ తుఫాను వ‌చ్చి వెళ్లడంతో అదే స్థాయిలో భారీ వాన‌లొస్తాయా అన్న సందేహా లు రైతుల్లో నెల‌కొన్నాయి. ద‌స‌రా రోజు మాత్రం మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షం కురిసింది. ఇదే స్థాయిలో శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రంతో స‌హా ప‌లు చోట్ల వాన‌లు కురిశాయి. శుక్ర‌, శ‌ని వారాల్లో ప‌లాస ప్రాంతంలో ఉద‌యం వేళ అత్య‌ధిక వ‌ర్షపాతం న‌మోదైంది. 14 సెంటీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. ఇంకా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వివిధ ప్రాంతాల్లో కూడా వాన‌లు కురిశాయి. వ‌ర్షాల‌కు విజ‌య‌వాడ ర‌హ‌దారులు జ‌ల మయం అయ్యాయి. వ‌ర్షాల ప్ర‌భావంతో జ‌రిగిన పంట న‌ష్టం వివ‌రాలు ఏవీ తెలియ‌డం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: