ఈ మ‌ధ్య కాలంలో సామాన్య‌లు ను వేధిస్తున్న స‌మ‌స్య ల‌లో ప్ర‌ధాన మైన‌ది పెట్రోల్ డిజిల్ గ్యాస్ ధ‌ర‌లు. గ‌త కొద్ధి రోజుల నుంచి అడ్డు అదుపు లేకుండా పెట్రోల్ డిజిల్ గ్యాస్ ల పై ధ‌ర‌లు పెరుగుతూనే ఉన్నాయి. ఒక సామ‌న్య యువ‌కుడు బ‌య‌ట‌కు బండి తీయాలంటే పెట్రోల్ ధ‌ర‌లకు భ‌య‌ప‌డి కాలి న‌డ‌క న తన గ‌మ్యా స్థానానికి చేరుకుంటుంన్నాడు. అంతే కాకుండా ఈ పెట్రోల్ బైక్ ల‌ను ప‌క్క‌న పెట్టి ఎలక్ట్రానిక్ ద్వ చక్రల పై వైపు చూస్తున్నారు. దీనికి కార‌ణం పెట్రోల్ డిజిల్ ధ‌ర‌లు పెర‌గ‌డ‌మే. అంతే కాకుండా చాలా మంది గృహిణులు వాడే గ్యాస్ ధ‌ర‌ల‌కు కూడా రెక్క‌లు వ‌స్తున్నాయి. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ లో స‌బ్సిడీ తో వచ్చే 14.2 కేజీల‌ గ్యాస్ ధ‌ర రూ. 646 ఉండేది అలాంటిది ప్ర‌స్తుతం అదే 14.2 కేజీ ల గ్యాస్ ధ‌ర రూ. 937 గా ఉంది. ఈ ఏడాది లో ఇదే అత్య‌ధిక ధ‌ర‌.




అయితే ఇలా పెట్రోల్ డిజిల్ గ్యాస్‌ ధ‌ర‌లు విప‌రీతంగా పెర‌గ‌డం పై సామ‌న్యులు న‌రకం చూస్తున్నారు. ఈ వ‌డ్డ‌న ఆపండి బాబోయ్ అంటు కేంద్ర ప్ర‌భుత్వాన్ని వేడు కుంటున్నారు. అయిన కేంద్ర ప్ర‌భుత్వం సామ‌న్య‌లు పై ఏమాత్రం క‌నిక‌రం చూపించ‌డం లేదు. త‌న‌కు ఏం ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుంది. అయితే కేంద్ర ప్ర‌భుత్వం ఈ ధ‌ర‌ల పెరుగుద‌ల పై  ఏ విధంగా స్పందించ‌క పొవ‌డం పై దేశ వ్యాప్తంగా ప్ర‌జలు ఆగ్ర‌హాం వ్య‌క్తం చేస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం త‌క్ష‌ణం స్పందించి పెరిగిన ధ‌ర‌ల‌ను కంట్రోల్ చేయ‌కుంటే ప్ర‌జా వ్య‌తిరేక‌తకు గురి కాక త‌ప్ప‌ద‌ని రాజ‌కీయా విశ్లేష‌కులు కూడా కేంద్రాన్ని హెచ్చరిస్తున్నారు. అయినా కేంద్ర ప్ర‌భుత్వం ఈ అంశం పై సైలెంట్ గానే ఉంటుంది. అయితే పెట్రోల్ డిజిల్ గ్యాస్ ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగి సామ‌న్య ప్ర‌జ‌లు నానా అవ‌స్థలు ప‌డుతూ ఉంటే కేంద్రం త‌న‌కు ఏ మాత్రం సంబంధం లేదు అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం పై ప్ర‌జ‌లు  ఆగ్ర‌హాం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ధ‌ర‌లు త‌గ్గించి సామ‌న్యు ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించాల‌ని కోరుతున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: