మ‌న దేశంలో కొన్ని సంవ‌త్స‌రాల క్రితం పెట్రోల్ డిజిల్ గ్యాస్ ధ‌ర‌లు పెరిగితే సామ‌న్య‌లు విష‌యం ప‌క్క‌న పెడితే ప్ర‌తి ప‌క్ష‌ల‌కు పండుగ వాత‌వ‌ర‌ణం ఉండేది. ఎందు కంటే అధికారం లో ఉన్న పార్టీ ని ప్ర‌జ‌ల చేత విమ‌ర్శ‌లు చేయించ వ‌చ్చు. అలాగే తమ పార్టీ గురించి ప్ర‌జ‌ల‌కు నాలుగు మంచి వ్యాఖ్య‌లు చెప్పి ఫ్రీగా ప‌బ్లిసిటీ చేసు కోవ‌చ్చు. అంతే కాకుండా ద్వి చ‌క్ర వాహానాలు కు తాడులు క‌ట్టి ఫోటో ల‌కు ఫోజ్ లు ఇవ్వ‌చ్చు. వాటిని సోష‌ల్ మీడియా లో పెట్టు కోవ‌చ్చు. అలాగే పొద్దునే న్యూస్ పెప‌ర్ల‌లో వ‌స్తే ప‌ది మందికి చూపించ వ‌చ్చు. ఇలా ఒక తంతు జ‌రిగేది. అలాగే ధ‌ర‌లు పెంచిన ప్ర‌భుత్వానికి నాలుగు ఐదు రోజులు నిద్ర లేకుండా ఆందోళ‌న‌లు చేసే వారు. అది కూడా పెట్రోల్ డిజిల్ పై రూ. 1 పెంచినందుకే నానా హంగామా చేసేవారు. దీని పై అధికారంలో ఉన్న పార్టీ వారు కూడా స‌మాధానం చెప్ప‌డానికి నానా ఇబ్బందులు ప‌డేవారు. కానీ ప్ర‌స్తుతం ఇలాంటి ప‌రిస్థితి ప్ర‌తి ప‌క్ష‌ల‌లో క‌నిపించ‌డం లేదు.




గ‌తంలో కాంగ్రెస్ హాయంలో పెట్రో ఉత్ప‌త్తు ల‌పై కేవ‌లం రూ. 1 పెంచితే అప్ప‌టి ప్ర‌తి ప‌క్ష పార్టీ అయిన బీజేపీ నానా హంగామా చేసింది. ప్ర‌జల దృష్టిలో హీరోలుగా మారే వారు. కానీ నేడు ప్ర‌తి ప‌క్షం లో ఉన్న  కాంగ్రెస్ మాత్రం అలా చేయ‌డం లేదు. ఇప్పుడు గ‌త కొద్ది రోజు ల్లోనే ఒక లీట‌ర్ పై రూ. 15 పెరిగితే కనీసం ఒక్క సారి అయిన రోడ్డు పై కి వ‌చ్చి ఆందోళ‌న‌లు చేయ‌లేదు. ఒక కాంగ్రెస్ పార్టీ యే కాదు మొత్తం ప్ర‌తి ప‌క్ష పార్టీల‌న్నీ కూడా ఇలానే ఉన్నాయి. దీంతో అడిగే వాడు లేడు క‌దా అని కేంద్రం పెట్రోల్ డిజిల్ గ్యాస్ ధ‌ర‌ల‌ను విప‌రీతం గా పెంచ‌తూ పోతుంది. అయితే కాంగ్రెస్ ప్ర‌స్తుతం ప్ర‌జా స‌మ‌స్య ల‌ను ప‌ట్టించు కోవ‌డం లేద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. కేవ‌లం వారి పార్టీ స మ‌స్య‌ల పైనే దృష్టి సారించార‌ని జోక్ లు కూడా వేస్తున్నారు. అయితే గ‌త కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో అనేక సంక్షోభాలు వ‌స్తున్నాయి. వాటిని త‌గ్గు ముఖం ప‌ట్టించ‌డానికే కాంగ్రెస్ అధిష్టానం స‌మ‌యం కేటాయిస్తుంది. అందుకే పెట్రోల్ డిజిల్ గ్యాస్ ధర‌లు ఆకాశాన్ని అంటుతున్న ఏమాత్రం స్పందించ‌డం లేదు.





మరింత సమాచారం తెలుసుకోండి: