టిఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నికలు అనివార్యం అయిన సంగతి తెలిసిందే. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా సరే కలవాలని టిఆర్ఎస్ పార్టీ పట్టుదలతో ముందుకు వెళుతూ మంత్రి హరీష్ రావుకు పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించడంతో హుజురాబాద్ లో ఎక్కువగా కష్టపడుతున్నారు. మంత్రి హరీష్ రావు దెబ్బకు టిఆర్ఎస్ పార్టీ కూడా కాస్త జాగ్రత్తగా.... మాట వింటూ   నియోజకవర్గంలో ముందుకు వెళుతుంది. ఈటెల రాజేందర్ వర్సెస్ హరీష్ రావు గా ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గం లో రాజకీయ చిత్రం మారిపోయింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

అయితే ఇప్పుడు హరీష్ రావు ప్రజల్లో కాస్త చులకన అయ్యారు అనే అభిప్రాయం కూడా కొంతమందిలో వ్యక్తం కావడం గమనార్హం. హుజురాబాద్ లో హరీష్ రావు మంత్రి హోదాలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు అలాగే ఈటెల రాజేందర్ అవినీతిపరుడు అని మాట్లాడుతున్న మాటలు ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీ మారారు అంటూ చేసిన వ్యాఖ్యలు అన్నీ కూడా కాస్త మంత్రి హరీష్ రావు పై చులకన భావాన్ని తీసుకొస్తున్నాయి.

హుజరాబాద్ గతంలో ఎప్పుడూ అభివృద్ధి కాలేదని కేవలం మూడు నాలుగు నెలల కాలంలోనే అభివృద్ధి జరిగిందని ఆయన మాట్లాడుతున్న మాటలు కూడా ఆయన ఇమేజ్ ని దిగజార్చాయి అనే అభిప్రాయం కూడా కొంతవరకు వ్యక్తమవుతోంది. అనవసరమైన విమర్శలు చేస్తూ ఈటెల రాజేందర్ ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తా... తాను ఇబ్బంది పడుతున్నారని కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత హరీష్ రావు ఇమేజ్ భారీగా పడిపోయిన దాన్ని అభిప్రాయం కూడా చాలా వరకు ఉంది. మరి దీన్ని హరీష్ రావు ఏ విధంగా కాపాడుకోబోతున్నారు ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: